'ధురంధర్ 2' మైండ్ బ్లోయింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ `ధురంధర్`. స్పై యాక్షన్ థ్రిల్లర్‌లకు ఓ సవాల్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.;
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ `ధురంధర్`. స్పై యాక్షన్ థ్రిల్లర్‌లకు ఓ సవాల్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. వసూళ్ల పరంగానూ అందరిని ఆశ్చర్యపరిచిన `ధురంధర్` ప్రపంచ వ్యాప్తంగా రూ.1345 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి 2025లో విడుదలై ఇండియన్ సినిమాల్లో సరికొత్త రికార్డుని సృష్టించింది. మౌత్ టాక్‌తో టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచిన ఈ మూవీకి త్వరలో పార్ట్ 2గా `ధురంధర్ 2` రానున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 ఆశ్చర్యపరచడంతో పార్ట్ 2పై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
దాంతో ప్రతి సినీ లవర్, జియో పాలిటిక్స్‌పై ఆసక్తి ఉన్న ప్రతీ సెలబ్రిటీ, పొలిటికల్ లీడర్స్ తో పాటు ప్రముఖులంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఊహించని స్థాయిలో పార్ట్ 2 ఉండనుందని క్లారిటీ ఇచ్చేసింది. ఓ రా ఏజెంట్ అత్యంత భయంకరంగా రివేంజ్ తీర్చుకునే స్టోరీగా రానుండటంతో ఇప్పుడు అందరి దృష్టి `ధురంధర్ 2`పై పడింది.
ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ఓటీటీ డీల్ ఇప్పటికే రికార్డు సృష్టించగా..ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ డీల్‌ని ప్రముఖ ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీయో హాట్ స్టార్ రూ.150 కోట్లకు క్లోజ్ చేసి షాక్ ఇచ్చింది. పార్ట్ 1ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంటే పార్ట్ 2ని తనకంటే భారీ మొత్తాన్ని కోట్ చేసి సియో హాట్ స్టార్ దక్కించుకోవడంతో పార్ట్ 2 బిజినెస్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
పార్ట్ 1 మ్యూజిక్ రైట్స్‌ని సారేగామ దక్కించుకుంది. అయితే పార్ట్ 2కు వచ్చే సరికి మ్యూజిక్ రైట్స్‌ని టి సిరీస్ భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇప్పటికే `ధురంధర్ 2`కు రూ.300పైనే దక్కినట్టుగా తెలుస్తోంది. రెండు భాగాలకు కలిపి రూ.475 కోట్లు ఖర్చు చేస్తే పార్ట్ 2 కోసం రూ.250 కోట్లు పెట్టారట. ఆ లెక్క ప్రకారం నాన్ థియేట్రికల్ బిజినెస్‌లోనే టేబుల్ ప్రాఫిట్‌లోకి వచ్చేసిన `ధురంధర్ 2` ఇక థియేట్రికల్ బిజినెస్‌తో రిలీజ్‌కు ముందే రికార్డు స్థాయి లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల కథనం.
పార్ట్ 1 ఇప్పటికే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.1345 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి రణ్‌వీర్ సింగ్ సినిమాల్లోనే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషలలో రిలీజ్‌కు రెడీ అవుతున్న`ధురంధర్ 2` ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో..ఏ స్థాయి రికార్డులని తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే.