సిగ్మా ట్రైలర్ టాక్: స్టైలిష్ యాక్షన్ లో సందీప్ కిషన్ గోల్ మాల్!
ఈ కథలో అసలు కాన్ఫ్లిక్ట్ అంతా వీరయ్య రెడ్డి అనే క్రూరమైన విలన్ చుట్టూనే తిరుగుతుంది. నటుడు సంపత్ రాజ్ ఈ పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపించారు.
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సిగ్మా. దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ చూశాక సినిమాపై మరికొంత బజ్ పెరిగింది. ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామాకు హీస్ట్ ఎలిమెంట్స్ జోడించి చాలా స్టైలిష్‌గా ఈ ప్రోమోను కట్ చేసి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేశారు.
జీవితంలో ఎప్పుడూ ఓడిపోయే ఒక సాధారణ యువకుడి చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్ ఓపెనింగ్ లోనే క్లారిటీ ఇచ్చారు. ప్రేమించిన అమ్మాయి కూడా తనని లైట్ తీసుకునే పరిస్థితి నుంచి, కోట్లు కొల్లగొట్టే స్థాయికి హీరో ఎలా ఎదిగాడనేది ఇంట్రెస్టింగ్ గా చూపించారు. వాళ్ళు మనల్ని మోసం చేస్తారు, కానీ మనం ఏం చేయకూడదా అంటూ సందీప్ చెప్పిన డైలాగ్ అతని క్యారెక్టర్ లోని గ్రే షేడ్స్ ను పరిచయం చేస్తూనే స్టోరీ లైన్ పై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ కథలో అసలు కాన్ఫ్లిక్ట్ అంతా వీరయ్య రెడ్డి అనే క్రూరమైన విలన్ చుట్టూనే తిరుగుతుంది. నటుడు సంపత్ రాజ్ ఈ పాత్రలో చాలా పవర్ఫుల్ గా కనిపించారు. ఏనుగు దంతాల స్మగ్లింగ్, వందల కోట్ల జూదం నేపథ్యంలో సాగే ఇల్లీగల్ బిజినెస్ నెట్‌వర్క్ ను ఈ ట్రైలర్ లో ప్రధానంగా హైలైట్ చేశారు. ఆ సామ్రాజ్యాన్ని ఢీకొట్టేందుకు హీరో వేసే ప్లాన్స్, ఫరియా అబ్దుల్లాతో కలిసి మాస్క్ లు వేసుకుని చేసే గోల్ మాల్ వ్యవహారాలు ఎంగేజింగ్ గా అనిపిస్తున్నాయి.
దర్శకుడు జాసన్ సంజయ్ కు ఇది మొదటి సినిమానే అయినా మేకింగ్ లో ఆ తడబాటు ఎక్కడా కనిపించలేదు. విదేశీ లొకేషన్లు, భారీ యాక్షన్ సీక్వెన్సులు, ఛేజింగ్స్ తో సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించారు. ఆర్జే సామ్ పాత్రలో ఫరియా గ్లామర్, ఎనర్జీ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. హీరో విలన్ల మధ్య మైండ్ గేమ్ తో పాటు కావాల్సినంత యాక్షన్ డోస్ కూడా ఎక్కడా తగ్గకుండా గట్టిగానే దట్టించినట్లు విజువల్స్ చెబుతున్నాయి.
ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రాణం పోసింది. యాక్షన్ బ్లాక్స్ లో మ్యూజిక్ చాలా ఎలివేట్ అయింది. ఓడిపోవడం నాకు కొత్త కాదు, కానీ మోసం చేసేవాళ్ళని వదిలిందే లేదు అంటూ రక్తంతో తడిసిన మొహంతో సందీప్ కిషన్ చెప్పిన మాస్ డైలాగ్ థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. లైకా ప్రొడక్షన్స్ పెట్టిన బడ్జెట్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్ లోనూ చాలా గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ అయ్యాయి.
మైత్రీ డిస్ట్రిబ్యూషన్స్ లాంటి పెద్ద సంస్థ రంగంలోకి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ రిలీజ్ దక్కనుంది. కమర్షియల్ హంగులకు క్రైమ్ థ్రిల్లర్ టచ్ ఇస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ తో జాసన్ సంజయ్ దర్శకుడిగా తన మార్క్ చూపించాడు. ఆకట్టుకునే విజువల్స్, ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే సినిమా మీద అంచనాలను పెంచుతున్నాయి. అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా సందీప్ కిషన్ కు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలిసొస్తుందో చూడాలి.