జంధ్యాల కామెడీకి, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి కామెడీకి అదే తేడా...

జింద్యాల సిచువేషన్ ను బేస్ చేసుకొని కామెడీ క్రియేట్ చేసేవారు. ఆయన క్యారెక్టర్ల మధ్య కామెడీని జనరేట్ చేసే ప్రయత్నం చేశారు.

Update: 2026-09-19 04:05 GMT

ఒకప్పుడు రచయితగా తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్న దర్శకుడు జంధ్యాల... ఈ జనరేషన్ ప్రేక్షకులకు ఆయన గురించి తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్ కి మాత్రం ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామెడీ సినిమాలకు సపరేట్ ఇమేజ్ ని తీసుకువచ్చిన రచయిత కూడా తనే కావడం విశేషం... ప్రతి సినిమాలో తన మార్కు కామెడీ ఉండటమే కాకుండా డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. చిరంజీవి లాంటి స్టార్ హీరోని పెట్టి 'చంటబ్బాయి' లాంటి ఒక కామెడీ సినిమాని చేసి సక్సెస్ ని సాధించాడు అంటే మామూలు విషయం కాదు. అలాంటి జంధ్యాల కామెడీని ఆ తర్వాత తరంలో ఎవరు కొనసాగిస్తారు అనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. ఇక అలాంటి సందర్భంలోనే త్రివిక్రమ్ ఇండస్ట్రీకి రావడం తన మార్క్ చూపిస్తూ మూవీస్ ను సక్సెస్ తీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహించాడు.

నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే నువ్వే, అతడు, ఖలేజా లాంటి సినిమాలతో త్రివిక్రమ్ తన పెన్ను పవర్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో కామెడీ కొంతవరకు తగ్గిందంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ తగ్గలేదు ఆయనే తగ్గించాడు. ఎప్పుడు ఒకే ఫార్మాట్ లో సినిమాలెందుకు అని ఆయన కొంచెం యాక్షన్ తో పాటు స్క్రీన్ ప్లే మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ప్రపంచ సినిమా స్టాండర్డ్స్ లో మూవీ చేయాలంటే డిఫరెంట్ మేకింగ్ తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు అందువల్లే కామెడీని తగ్గించాడు.

ఇక త్రివిక్రమ్ తర్వాత అనిల్ రావిపూడి జంధ్యాల ఫార్మాట్ ను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. నిజానికి అనిల్ రావిపూడి సినిమాలో వచ్చే కామెడీ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఆయన సినిమా వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు ఆ సినిమాలని ఆదరిస్తున్నారు. కొంత మంది మాత్రం ఆయన సినిమాల్లో క్రింజ్ కామెడీ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాయి. అందువల్లే కదా ఆయన వరుసగా 9 విజయాలను అందుకున్నాడు. విమర్శించేవారు ఎప్పుడు వెనక్కి లాగాలనే చూస్తారు. కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఇవాళ్ళ మనల్ని తగ్గించిన వాళ్ళే రేపు మనల్ని పొగుడుతారు. వాళ్ళ మాటలకు నిరసించిపోయి నీ ప్రయత్నం మాత్రం ఆపకు అనే మాటలను అనిల్ బాగా ఫాలోవుతున్నాడు. అందుకే ఆయన సినిమాలు రిలీజైనప్పుడు కొంతమంది ఆ మూవీస్ మీద నెగెటివ్ కామెంట్స్ చేసిన కూడా ఆ తర్వాత వాళ్లే అనిల్ మూవీలో కామెడీ బాగుంటుందని చెబుతుండటం విశేషం...

అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక సీన్ లోని ట్రీట్మెంట్ లో కొత్తదనం ఉండేలా చూసుకుంటూ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా కామెడీ సీన్స్ ను రాసుకోవడం లో అనిల్ రావిపూడి సక్సెస్ అవుతున్నాడనే చెప్పాలి. నిజానికి అప్పటి జనరేషన్ కి తగ్గ కామెడీని జంధ్యాల రాస్తే, ఈ జంజీ జనరేషన్ కి సెట్ అయ్యే కామెడీని త్రివిక్రమ్, అనిల్ రావిపూడి రాసుకుంటుండటం విశేషం...నిజానికి జంధ్యాల తర్వాత ఆ లెగసీ ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ల లో త్రివిక్రమ్, అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉన్నారు.

Tags:    

Similar News