ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?
| తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది .
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది . అనిరుధ్ పెళ్లి వార్తలతో పాటు ఆయన పెళ్లికి ఎవరెవరు హాజరవుతారనే విషయం కూడా కోలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పెళ్లి ఆహ్వానాల జాబితాలో ఒక స్టార్ హీరో పేరు కనిపించడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
చెన్నై మీడియా కథనాల ప్రకారం, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లకు అనిరుధ్ పెళ్లి ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. అయితే హీరో ధనుష్‌కు మాత్రం ఆహ్వానం అందలేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
ధనుష్ పేరు వినిపివ్వడానికి కారణం లేకపోలేదు. గతంలో ఆయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే 2022లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్ అనిరుధ్ పెళ్లికి వస్తారా.. ఆయనకు ఆహ్వానం అందిందా.. అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి.
అనిరుధ్‌కు సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ధనుష్‌తో కూడా అనిరుధ్‌కు గతంలో మంచి స్నేహం, వృత్తిపరమైన సంబంధం ఉండేది. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్ హిట్ పాటలు వచ్చాయి. కొన్ని సినిమాలకు వీరిద్దరి కాంబినేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇలాంటి సమయంలో ధనుష్‌ను మాత్రమే పక్కన పెట్టారనే వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒక హీరోను మినహాయించి ఇండస్ట్రీలో అందరినీ పిలిస్తే, ఆ హీరో అభిమానులు బాధపడటం సహజమే. అందుకే సోషల్ మీడియాలో ఈ విషయం గురించి పెద్ద వివాదమే నడుస్తోంది.
మరోవైపు, ధనుష్‌కు తప్పకుండా ఆహ్వానం అందుతుందని కొందరు అభిమానులు నమ్ముతున్నారు. రజనీకాంత్ ఇంట్లో జరిగే వేడుకకు ధనుష్‌ను పిలవకుండా ఉంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు.