• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ రెండు లెజెండరీ...

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

| తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-05 01:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తరతరాలుగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ప్రేమను సంపాదించుకున్న ఫ్యామిలీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాల గురించి మాట్లాడితే ముందుగా నందమూరి, అక్కినేని, మెగా, దగ్గుబాటి, అల్లు ఫ్యామిలీలు గుర్తుకు వస్తాయి. ఈ కుటుంబాలకు.. తెలుగు సినిమాతో విడదీయలేని అనుబంధం ఉంది.

ఒకే కుటుంబానికి చెందిన పలువురు నటులు ఒకే వేదికపై కనిపిస్తే.. ఇక అధికాష్ట అభిమానులకు పండగే. ముఖ్యంగా తమ అభిమాన హీరోలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా ఒకే కార్యక్రమంలో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం మెగాస్టార్ చిరంజీవి కొత్త టాక్ షో ద్వారా రాబోతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న మెగావర్స్ అనే టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పలు ప్రత్యేక ఎపిసోడ్లను ప్లాన్ చేస్తున్నారు. అందులో మెగా ఫ్యామిలీతో ఒక ప్రత్యేక ఎపిసోడ్ ఉండనుంది అని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ ఎపిసోడ్‌లో చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఒకే వేదికపై కలిసి మాట్లాడటం మెగా అభిమానులకు పెద్ద ఆకర్షణగా మారనుంది. అందుకే ఈ ప్రోగ్రాం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ తర్వాత అక్కినేని కుటుంబం కూడా మెగావర్స్ లో సందడి చేయనుందని వార్తలు వస్తున్నాయి. నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి ఒక ప్రత్యేక ఎపిసోడ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం. అక్కినేని ఫ్యామిలీ ఎపిసోడ్ షూటింగ్ ఈ వారంలో జరగనుందని కూడా ప్రచారం జరుగుతోంది. హహనాగార్జున, చైతన్య, అఖిల్ ఒకే వేదికపై కనిపించడం అక్కినేని అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వనుంది.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన రెండు పెద్ద కుటుంబాలను ఒకే కార్యక్రమంలో చూపించేందుకు చిరంజీవి ప్రోగ్రాం ద్వారా నెట్ఫ్ ఫ్లిక్స్ సిద్ధమైపోతోంది. మరి ఈ రెండు ఎపిసోడ్లు ఎలాంటి బుల్లితెర టీఆర్పి తీసుకొస్తాయో వేచి చూడాలి.

Tags:    
  • chiranjeevi 
  • megaverse 
  • netflix 
  • megafamily 
  • akkinenifamily 
  • pawankalyan 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS