• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'జైలర్ 2' విజువల్స్...

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

| సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంది.

By - Gopi Velupala
Update: 2026-11-05 00:30 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంది. భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది...రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా విజయంలో 'నెల్సన్ దిలీప్ కుమార్' చాలా కీలకపాత్ర వహించాడు. రజినీకాంత్ ను ఎలా చూపిస్తే ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఆయనలోని ఎనర్జీ ని ఎలా వాడుకోవాలి అనేది నెల్సన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అలాగే సినిమాలో ఫ్రేమ్స్ కూడా చాలా కొత్తగా కనిపించాయి. ఒక యూనిక్ స్టైల్ లో ఉండటం వల్ల ప్రేక్షకుడికి బాగా నచ్చాయి. ఈ సినిమా కోసం ఎలాంటి సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ వాడారో తెలుసుకుందాం...

సినిమాటోగ్రఫీ టెక్నిక్స్...

సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ సైతం ఈ మూవీ కోసం డిఫరెంట్ యాంగిల్స్ ను వాడరు. ఒక రకంగా ప్రయోగం చేశారనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ లోని రూల్ ఆఫ్ థర్డ్ నియమం ప్రకారం ఫ్రేమ్ లో కనిపించే క్యారెక్టర్స్ కి హెడ్ పైన స్పేస్ ఉండకూడదు. కానీ ఇందులో ఒక యూనిక్ స్టైల్ కోసం హెడ్ మీద స్పేస్ ఉంచారు. దాంతో ఫ్రేమింగ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. అలాగే చాలా ఫ్రేమ్స్ లో మెయిన్ క్యారెక్టర్ ను సెంటర్ ఫ్రేమ్ లో పెట్టారు. దీనివల్ల స్క్రీన్ కి విజువల్ బ్యూటీ వచ్చింది.

వైడ్ లెన్స్ క్లోజ్ షాట్స్...

సాధారణంగా వైడ్ లెన్స్ తో వైడ్ షాట్స్ తీస్తారు. కానీ ఇందులో మాత్రం వైడ్ లెన్స్ తో క్లోజ్ షాట్స్ తీశారు. దీనివల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి అదే వరల్డ్ లో ఉన్నాడనే ఫీల్ కలుగుతుంది. దీనివల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక కొత్త ఫీల్ క్రియేట్ అవుతుంది. దీనివల్లే రజీకాంత్ సైతం క్లోజ్ షాట్స్ లో చాలా బాగా ఎలివేట్ అయ్యాడు.

కెమెరా మూవ్ మెంట్ అండ్ ఫాంటమ్ స్లో మోషన్స్

రజినీకాంత్ డైలాగ్ డెలివరీ టైమ్ లో స్టడీ బ్లాక్స్ పెట్టారు. కానీ ఆయన వాకింగ్ షాట్స్ లో ఆయన స్వాగ్ ను ఎలివేట్ చేయడానికి 'ఫాంటమ్ హై స్పీడ్ కెమెరా తో 1000 fps' తో షూట్ చేశారు. దానివల్ల స్క్రీన్ మీద స్లో మోషన్ ఎక్కువ సేపు రావడంతో నిదానంగా రజినీకాంత్ స్వాగ్ ను బిల్డ్ చేయగలిగారు. అలాగే టీ షాప్ లో జరిగే ఫైట్ లో మొదట దానిని డార్క్ ఫేజ్ లోనే పెట్టి, ఆ తర్వాత గన్ ఫైర్ చేస్తుంటే ఒక్కో విజువల్ ఒక్కో లైట్ కలర్ లో పెట్టి ప్రేక్షకుడికి విజువల్ హై ఇచ్చారు. ఇలా ఫ్రేమ్స్ తో లైటింగ్ తో సినిమాను విజువల్ గా చాలా కలర్ ఫుల్ గా తయారుచేశారు.

ఈరోజుల్లో ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. కాబట్టి దానిని గ్రహించి సినిమాలో కంటెంట్ కొత్తగా లేకపోయిన స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తూ, విజువల్ గా ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేసే టెక్నిక్స్ తెలిసిన దర్శకులు సూపర్ హిట్స్ అందుకుంటున్నారు...

Tags:    
  • jailer2 
  • rajinikanth 
  • nelsondilipkumar 
  • vijaykarthikkannan 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS