నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!
| తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందమైన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందమైన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తన నటనతో.. అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న సినిమాలు చేసిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వచ్చిన చందమామ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కాజల్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కాజల్ చెప్పిన విషయం ఆసక్తికరంగా మారింది. తన తల్లిదండ్రులకు తన కెరీర్‌లో ఏ సినిమా అంటే చాలా ఇష్టం అని ఒక బాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో.. యాంకర్ అడిగారు. దీనికి కాజల్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తన తల్లిదండ్రులకు లక్ష్మీ కళ్యాణం సినిమా అంటే చాలా ఇష్టమని కాజల్ తెలిపారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకోకపోయినా, కాజల్ తన హిట్ సినిమాలు అన్ని పక్కన పెట్టి.. ఈ సినిమా పేరు చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.. అయితే దీనికి కారణం కూడా కాజల్ వివరించారు. ఆ సమయంలో తనకు నటన గురించి పెద్దగా తెలియదని, ఎలాంటి నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకోలేదని చెప్పారు. సినిమాలు చేస్తూ నటన నేర్చుకున్నానని తెలిపారు.
లక్ష్మీ కళ్యాణం సినిమాలోని సన్నివేశాలను సహజంగా చేశానని, ప్రతి ఎమోషన్‌ను నిజంగా ఫీల్ అయ్యానని చెప్పారు. ఒక సన్నివేశంలో కొట్టే సందర్భం వచ్చినప్పుడు కూడా నిజంగానే కొట్టారని, ఆ ఎమోషన్ కూడా.. ఫీల్ అవుతూ నటించానని గుర్తు చేసుకున్నారు.
అందుకే ఆ సినిమాలో తన నటన సహజంగా ఉంటుందని, తన తల్లిదండ్రులకు కూడా ఆ సినిమా ఎంతో ఇష్టమని కాజల్ చెప్పారు. ఇక ప్రస్తుతం కాజల్ నటించిన రామాయణ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో కాజల్ మండోదరీగా కనిపించనింది.