• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుకుమార్ రామ్ చరణ్ ను...

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

| టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

By - Gopi Velupala
Update: 2026-11-04 23:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సుకుమార్ లాంటి దర్శకుడు సైతం కెరియర్ స్టార్టింగ్ లో లవ్ స్టోరీలతో సక్సెస్ లను సాధించాడు. కానీ రంగస్థలం, పుష్ప, పుష్ప2 సినిమాలతో రా అండ్ రస్ట్రిక్ కథలను ఎంచుకొని ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో మరోసారి జతకడుతున్నాడు. వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది...

రామ్ చరణ్ కి ఆ క్యారెక్టర్ సెట్ అవుతుందా

రంగస్థలం సినిమాని ఎలాగైతే క్యారక్టరైజేషన్ మీద డిజైన్ చేశారో ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాని కూడా అదే తరహాలో రాసుకున్నట్టుగా తెలుస్తుంది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ని చెవిటి వాడిగా చూపించాడు ఇప్పుడు మాత్రం రెండు విభిన్న కోణాల్లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకటి కరాటే ఫైటర్ క్యారెక్టర్ గా తెలుస్తుంది. కరాటే తెలిసిన ఒక కుర్రాడిగా తను కనిపించే ప్రయత్నంలో ఉన్నాడట. ఈ క్యారెక్టర్ లో రామ్ చరణ్ పక్కగా ప్రేక్షకులను అలరిస్తాడు. రెండో క్యారెక్టర్ ఏంటనే విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కరాటే ఫైటర్ క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

ఈ క్యారెక్టర్ మీద సుకుమార్, రామ్ చరణ్ ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రామ్ చరణ్ అభిమానులు మాత్రం సోషల్ మీడియా మొత్తం ఈ న్యూస్ ను సర్క్యులేట్ చేస్తున్నారు. పెద్ది మూవీలో కుస్తీ ఫైటర్ గా కనిపించిన రామ్ చరణ్ ఈ సినిమాలో కరాటే మాస్టర్ గా కనిపించబోతున్నాడనే విషయం అతని అభిమానులను ఆనందపరుస్తుంది. పెద్ది సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో కొంతవరకు విఫలమైంది. కాబట్టి ఈ సినిమా విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకొని మరి పకడ్బంది ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు.

రామ్ చరణ్ వైవిధ్యమైన పాత్రలకే మొగ్గు చూపిస్తున్నాడా...

రామ్ చరణ్ వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు కాబట్టి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశ్యంతో ఆయన తన క్యారెక్టర్ ను చాలా కొత్తగా డిజైన్ చేయించుకుంటున్నాడు. సుకుమార్ లాంటి టాలెంటెడ్ స్క్రీన్ ప్లే రైటర్లు రామ్ చరణ్ క్యారెక్టర్ ను నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారనేది వాస్తవం. రామ్ చరణ్ సైతం పూర్తిగా సుకుమార్ కి సరెండర్ అయి సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

Tags:    
  • ramcharan 
  • sukumar 
  • ramcharansukumarfilm 
  • karatefighter 
  • rangasthalam 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS