• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ట్ నటుడు తమ్ముడితో...

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

| ఇప్పటికే ఎల్లమ్మ టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ చేసిన ప్రత్యేక ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షించింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-05 04:14 GMT

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఎల్లమ్మ. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బలగం సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ప్రముఖ నటుడి సోదరుడు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఆయన ఎవరు..ఈ పాత్ర ఎలా ఉండబోతోంది..అనే విషయాలపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్త కానీ నిజమైతే సినిమాలో విలన్ పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తుండటంతో పాటు, ఈ సినిమాలో బలమైన ప్రతినాయకుడిని చూపించబోతున్నారనే ప్రచారం సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది.

ఇప్పటికే ఎల్లమ్మ టైటిల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ చేసిన ప్రత్యేక ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది జానపద కళాకారులను ఒకచోట చేర్చి ఈ పాటను రూపొందిస్తున్నారు. భారతీయ జానపద సంగీతంలోని వైవిధ్యాన్ని ఒకే పాటలో చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. విభిన్న ప్రాంతాల సంప్రదాయాలు, సంగీత శైలులు ఈ పాటలో వినిపించనున్నాయి.

బలగం సినిమాతో తెలంగాణ పల్లె జీవితాన్ని, మనుషుల మధ్య అనుబంధాలను ఎంతో సహజంగా చూపించిన వేణు యెల్దండి.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో మరోసారి జానపద నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఈసారి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. కథ, సంగీతం, నటీనటుల ఎంపికతో ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా మారుతోంది.

దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్తుండటంతో ఆయన నటన ఎలా ఉండబోతోందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో ఉంది. మరోవైపు విలన్ పాత్రకు సంబంధించిన వార్తలు సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.

ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే తొలి పాటను విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించింది చిత్ర బృందం.

Tags:    
  • devisriprasad 
  • yellamma 
  • venuyeldandi 
  • dilraju 
  • telugucinema 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS