గేమ్ ని సీరియస్ గా తీసుకోని వర్షిణి.. ఇలా అయితే కష్టమే!
కెప్టెన్సీ టాస్క్ లో మొదటి రౌండ్ లో భాగంగా గార్డులు రెండు వర్గాలుగా విడిపోయి వ్యూహాలు అమలు చేశారు. వర్షిణి, నరేష్, దేబ్జానీ ప్రధానంగా షాలినిని లక్ష్యంగా చేసుకున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 10లో 12వ రోజు రసవత్తరంగా సాగిన కెప్టెన్సీ పోరులో రైతు బిడ్డ ఝాన్సీ విజేతగా నిలిచి, హౌస్‌కు తొలి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో గెలుపొందిన ఆమెకు బిగ్‌బాస్ ప్రత్యేక కెప్టెన్ గదిని కేటాయిస్తూ అభినందనలు తెలిపారు. అయితే ఈ గేమ్ లో అందరూ తమ వంతు కృషి చేసినప్పటికీ, సిల్లీ గా గేమ్ ఆడుతూ సీరియస్నెస్ ప్రదర్శించకుండా వర్షిణి డేంజర్ లో పడుతుంది.
కెప్టెన్సీ టాస్క్ లో మొదటి రౌండ్ లో భాగంగా గార్డులు రెండు వర్గాలుగా విడిపోయి వ్యూహాలు అమలు చేశారు. వర్షిణి, నరేష్, దేబ్జానీ ప్రధానంగా షాలినిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ సమయంలో వర్షిణి షాలినిని అడ్డుకుంటూ.. "రామ్ ప్రసాద్ కెప్టెన్ కావాలన్నది మా ఆలోచన. నీకు వయస్సు, అనుభవం తక్కువ" అని వ్యాఖ్యానించింది. ఇదే విషయం మనకి ప్రోమో లో కూడా వేశారు. అప్పటికీ షాలిని విడిపిన్చుకోవడానికి ట్రై చేసింది కానీ కుదర్లేదు.
దీంతో మొదటి రౌండ్‌లోనే షాలిని ఎలిమినేట్ అయ్యింది. ఓడిపోయిన తర్వాత వర్షిణి చేసిన వ్యాఖ్యలపై షాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
"వయసున్న వాళ్లే కెప్టెన్ కావాలంటే ఈ టాస్కులు ఎందుకు? ట్రోఫీ కూడా వాళ్లకే ఇచ్చేయండి. ఇష్టం లేకపోతే నేరుగా చెప్పాలి కానీ ఇలాంటి అర్థంలేని కారణాలు చెప్పొద్దు" అంటూ నిలదీసింది. అయితే రాంప్రసాద్ గెలవాలనే ఉద్దేశ్యం తో వర్షిణి గేమ్ ఆడటం లో తప్పు లేదు కానీ ఆమె ఇచ్చిన రీజన్ కరెక్టుగా లేదు.
అంతకు ముందు చాలా మంది షాలిని కి యాంగర్ మేనేజ్మెంట్ లేదు, కొన్ని స్కిల్స్ లేవు అని చెప్పినప్పుడు ఆమె ఒప్పుకుంది. కానీ ఇప్పుడు వయసు అనుభవం గురించి మాట్లాడేసరికి పెద్ద గొడవ చేసింది. ఆల్రెడీ వారం మొదట్లో నామినేషన్స్ ప్రక్రియ అప్పుడే షాలిని కి వర్షిణి కి గొడవ అయిన కారణంగా, వర్షిణి ఇంకా దాన్ని క్యారీ ఫార్వార్డ్ చేస్తుంది అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మొన్న ఇంకో టాస్క్ లో కూడా వర్షిణి కి షాలిని కి గొడవ జరిగి చివరికి ఇప్పుడు కూడా ఇద్దరూ ఇలా గొడవ పడటం వర్షిణి కే నష్టం తీసుకొస్తుంది.
రీజన్స్ సరిగ్గా చెప్పకపోవడం, సొంతంగా ఏదైనా మార్క్ క్రియేట్ చేసుకొనేలా ఆడకపోవడం తో వర్షిణి ఈ ఆటకి పనికి రాదూ అని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆ దిశగానే ఆమె వోటింగ్ ట్రెండ్స్ లో వెనుకంజ లో ఉందని సమాచారం.