• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్‌లో కనిపించని...

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

| ఒక సినిమా విడుదలవుతోంది అంటే.. ఆ సినిమా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగిస్తేనే.. పాన్ ఇండియా పరంగా మొదటి రోజు మంచి కలెక్షన్స్ తెచ్చుకోగలుగుతుంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-04 10:58 GMT

ఒక సినిమా విడుదలవుతోంది అంటే.. ఆ సినిమా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగిస్తేనే.. పాన్ ఇండియా పరంగా మొదటి రోజు మంచి కలెక్షన్స్ తెచ్చుకోగలుగుతుంది. కానీ రామాయణ పరిస్థితి మాత్రం ఎందుకు భిన్నంగా ఉంది.

భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా తెరకెక్కుతున్న సినిమా రామాయణం. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. నవంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు.

భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ఎన్నో ప్రమోషన్లు చేస్తోంది. ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలు తో కూడిన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఇంకా బలమైన ఆసక్తి ఏర్పడలేదు.

దీనికి ప్రధాన కారణం రామాయణం కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తది కాకపోవడమే. ఇప్పటికే ఈ ఇతిహాసం ఆధారంగా ఎన్నో సినిమాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. చిన్నప్పటి నుంచి చాలామంది రామాయణ కథను చూస్తూ, వింటూ పెరిగారు. అందుకే మరోసారి అదే కథను తెరపై చూపిస్తున్నారంటే ప్రేక్షకుల్లో వెంటనే ఆసక్తి కలగడం లేదు. అంతేకాకుండా ఈ సినిమాలో అన్ని భాషలకు సంబంధించిన నటుడు ఉన్న తెలుగు నుంచి.. నటిస్తున్న స్ట్రాంగ్ నటులు ఎవరూ లేరు.

రామాయణం కథతో ఎన్ని సినిమాలైనా తెరకెక్కించవచ్చు. కానీ ఆ కథను ప్రేక్షకులకు ఎంత బలంగా చేరవేస్తున్నామన్నదే ముఖ్యం. కొత్తగా ఏమి చూపిస్తున్నారు? పాత్రలను ఎలా తెరకెక్కించారు? అనే విషయాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించాలి.

కేవలం భారీ విజువల్స్, హాలీవుడ్ స్థాయి నిర్మాణం ఉంటే సరిపోదు. రాముడు, సీత, రావణుడి పాత్రలను ప్రేక్షకుల మనసులకు చేరువ చేసేలా చూపించాలి. అప్పుడే సినిమా నిజమైన విజయాన్ని అందుకోగలదు.

విడుదలకు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందానికి పెద్దగా సమయం లేదు. తెలుగు మీడియాతో మరిన్ని ఇంటర్వ్యూలు, ప్రత్యేక ప్రమోషన్లు నిర్వహిస్తే కొంతవరకు బజ్ పెరిగే అవకాశం ఉంది. మరి ఇంత మినిమం ఎక్స్పెక్టేషన్స్లో వస్తువున్న రామాయణం సినిమా తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

Tags:    
  • ramayanamovie 
  • niteshtiwari 
  • tollywood 
  • telugucinema 
  • saipallavi 
  • yash 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS