చందమామ..నీకు అంత కోపమా..!
| చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిజంగానే చందమామ అని పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిజంగానే చందమామ అని పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేసిన కాజల్, కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత తల్లి అయినప్పటికీ, మళ్లీ సినిమాల్లోకి వచ్చి తన సత్తా చాటుతోంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ రామాయణం సినిమాలో రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ స్పెషల్ స్క్రీనింగ్ కి కాజల్ హాజరైంది. ఈ కార్యక్రమానికి తన కొడుకుతో కలిసి వచ్చిన ఆమె, తన కొడుకుని ఎత్తుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వేడుకలో రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్, నితేష్ తివారీ, వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్, లారా దత్తా తదితరులు కూడా పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కాజల్ ఫోన్ అడిగి తీసుకుని ఎవరో ఒకరితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో ఆమె ముఖంలో చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్ కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
బిడ్డను ఎత్తుకుని ఉన్న కాజల్ ఫోన్లో మాట్లాడుతున్న తీరు చూసి..ఆమె చాలా కోపంగా ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా నవ్వుతూ కనిపించే చందమామ ఇలా సీరియస్గా కనిపించడంతో ఈ వీడియోపై ఆసక్తి పెరిగింది.
‘చందమామ నీకు అంత కోపమా?’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆమె ఎందుకు అలా మాట్లాడింది, ఎవరితో ఫోన్లో మాట్లాడింది అనే విషయం మాత్రం తెలియదు.
మరోవైపు రామాయణం సినిమాలో మండోదరిగా కాజల్ ఎలా కనిపించనుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్లో మరో ప్రత్యేకమైన పాత్రగా నిలుస్తుందేమో చూడాలి.