• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సినిమాను బలిపశువును...

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

| తన సినిమాల్లోని హింసపై గతంలోనూ విమర్శలు ఎదుర్కొన్న వంగా, ఈసారి మాత్రం నిజజీవిత ఘటనను తన సినిమాతో లింక్ చేయడంపై ఘాటుగా స్పందించారు.

By - M Prashanth
Update: 2026-11-04 09:12 GMT

ఏదైనా పెద్ద నేరం జరిగినప్పుడు దానికి సినిమాల ప్రభావమే కారణమంటూ ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. ఇటీవల ఏపీలోని రాప్తాడు పాఠశాలలో ఓ విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనను కొందరు 'యానిమల్' సినిమాతో ముడిపెడుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను విమర్శించారు. తన సినిమాల్లోని హింసపై గతంలోనూ విమర్శలు ఎదుర్కొన్న వంగా, ఈసారి మాత్రం నిజజీవిత ఘటనను తన సినిమాతో లింక్ చేయడంపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని కొందరిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ మరింత కాంట్రవర్సీగా మారాయి.

 

ఇక 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ తుపాకీతో స్కూల్‌లోకి వెళ్లే సన్నివేశం ఉంది. రాప్తాడు ఘటన తర్వాత కొందరు ఆ సీన్‌ను ప్రస్తావించారు. అయితే ఒక దారుణమైన నేరం జరిగినప్పుడు ముందుగా బాధితులు, వారి కుటుంబాల గురించి ఆలోచించాలని వంగా అన్నారు. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. అదంతా వదిలేసి సినిమాను సులభంగా బలిపశువును చేయడం కరెక్ట్ కాదన్నారు. కొందరికి బాధితులపై సానుభూతి కంటే తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడమే ముఖ్యంగా మారిందంటూ మండిపడ్డారు.

ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలను వంగా గట్టిగానే టార్గెట్ చేశారు. అవకాశాలు లేక నిరాశలో ఉన్నవాళ్లు ఇతరుల పనిని విమర్శించే అవకాశం రాగానే సామాజిక సంస్కర్తలుగా మారిపోతున్నారని అన్నారు. ఒకరి సినిమాపై తమకున్న కోపాన్ని బయటపెట్టడానికి ఇంతటి విషాదాన్ని ఉపయోగించుకోవడం దారుణమని విమర్శించారు.

నిజానికి 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాల విషయంలో వంగా మొదటి నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హీరోల ప్రవర్తన, హింసాత్మక సన్నివేశాలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటికి వంగా కూడా గతంలో తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. కానీ ఈసారి వ్యవహారం వేరు. సినిమాల్లో చూపించిన సన్నివేశాలను విమర్శించడం కాకుండా, బయట జరిగిన ఓ నేరానికి ఆయన చిత్రాన్ని కారణంగా చూపించే ప్రయత్నం జరగడమే ఈ వివాదానికి దారితీసింది.

మరోవైపు వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 'యానిమల్' తర్వాత వంగా చేస్తున్న సినిమా కావడంతో ఇందులో యాక్షన్, వయొలెన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా ఉంది. గత సినిమాల విషయంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో 'స్పిరిట్'లో ఆయన ఎలాంటి కథను చూపించబోతున్నారనేది చూడాలి.

Tags:    
  • sandeepreddyvanga 
  • animalmovie 
  • prabhas 
  • spirit 
  • telugucinema 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS