నాని జడల వెనుక ఇంత కథ ఉందా!
అసలు ది ప్యారడైజ్ లో నాని జడల లుక్ వెనుక చాలా కష్టం ఉంది. కథకు తగ్గట్టుగా స్పెషల్ గా కనిపించేందుకు నాని ఆ లుక్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు.
సినిమాలో హీరో కనిపించే లుక్ కు.. బయట ఆయన కనిపించే లుక్ కు తేడా ఉండటం కామనే. కానీ అదే విషయాన్ని ఓ ఫ్యాన్ నేచురల్ స్టార్ నాని దగ్గర ప్రస్తావించడంతో ప్రెస్ మీట్ లో నవ్వులు పూశాయి. ప్రస్తుతం ది ప్యారడైజ్ లో నాని వేసుకున్న జడల్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో విగ్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ తో జడలు పెట్టుకుని.. బయట మాత్రం జడలు పెంచుకోవాలని ఎలా చెబుతారని ఫ్యాన్ సరదాగా ప్రశ్నించగా, నాని ఇచ్చిన సమాధానం కూడా అదే రేంజ్ లో ఫన్నీగా ఉంది.
కన్నడ మీడియా మీట్ లో నానికి ఈ ప్రశ్న ఎదురైంది. "మీరు జడలు పెంచుకోకుండా విగ్ పెట్టుకుని సినిమాలో నటించారు. అలాంటప్పుడు బయట అందరూ జడలు పెంచుకోవాలని ఎలా చెబుతున్నారు?" అంటూ అభిమాని ప్రశ్నించారు. దీంతో నాని నవ్వుతూ.. తాను యాక్టర్ నని గుర్తుచేశారు. సినిమాలో తాను నటించి ఏడుస్తానని.. అలా చేశానని నిజ జీవితంలో ప్రేక్షకులు కూడా ఏడవాల్సిన అవసరం లేదన్న అర్థంలో చమత్కరించారు. ఆయన ఇచ్చిన ఆన్సర్ అక్కడున్న వారిని నవ్వించింది.
అసలు ది ప్యారడైజ్ లో నాని జడల లుక్ వెనుక చాలా కష్టం ఉంది. కథకు తగ్గట్టుగా స్పెషల్ గా కనిపించేందుకు నాని ఆ లుక్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ తో పాటు పొడవాటి గడ్డం, ముక్కు పుడక, రెండు జడలతో పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నారు. ఆ లుక్ కోసం షూటింగ్ సమయంలో చాలా కాలం పాటు అదే గెటప్ లో ఉండాల్సి వచ్చిందని నాని ఇప్పటికే వెల్లడించారు.
ఇక ప్యారడైజ్ లో నాని జడల లుక్ ప్రేక్షకులపై ఎంత ఎఫెక్ట్ చూపించిందో చెప్పడానికి మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. సినిమాలోని పాట విడుదలైన తర్వాత నాని జడల్ లుక్ కు సంబంధించిన డూప్లికేట్ జడలకు భారీ డిమాండ్ వచ్చింది. ఆన్ లైన్ లో లక్షకు పైగా నకిలీ జడలు సేల్ అయ్యాయని నాని సరదాగా చెప్పుకొచ్చారు. అంటే స్క్రీన్ పై కనిపించిన జడలు.. బయట కూడా ట్రెండ్ అయ్యాయన్నమాట.
ఆ లుక్ కేవలం స్టైల్ కోసం పెట్టింది కాదని మూవీ టీమ్ చెబుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చిన్నతనంలో తన తల్లి తనకు ఇలాంటి జడలు వేసి పెంచారట. అందుకే ఆ లుక్ తో దర్శకుడికి వ్యక్తిగతంగా ఓ రిలేషన్ కూడా ఉంది. సినిమాలో నాని రోల్ కు ఆ జడల వెనుక ఓ స్ట్రాంగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందని అనేక మంది అంచనా వేస్తున్నారు.
అయితే బ్లాక్ బస్టర్ మూవీ దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి కథ, పాత్ర, లుక్ విషయంలో ఎక్కడా తగ్గకుండా సినిమా రూపొందించామని నాని చెబుతున్నారు. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది ప్యారడైజ్.