తెలుగు హీరోలకు తమిళ్ హీరోలకు ఆ ఒక్కటే తేడా?
తమిళ్ హీరోలు ఎలాంటి పాత్రనైనా సరే దానికి ప్రాణం పోసి అందులో జీవించేసి సినిమాను విజయ తీరాలకు చేస్తుంటారు.
సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్ గా మారిపోయింది. దానిమీద ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి. అందుకే ప్రతి వారం రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలని ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సగటు ప్రేక్షకులు సైతం థియేటర్ కి వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేయడమే కాకుండా మూవీ బాగుంటే యునన్ మస్ గా దానిని సక్సెస్ చేస్తున్నారు. తద్వారా దర్శక నిర్మాతలకు హీరోలకు గొప్ప గుర్తింపైతే వస్తుంది. ఇట్లాంటి క్రమంలోనే తెలుగు సినిమా హీరోలు డిఫరెంట్ క్యారెక్టర్లను చేయడంలో కొంతవరకు వెనకబడిపోయారు. అందువల్లే వాళ్ళు ఎంచుకుంటున్న కథలు గాని, వాళ్ళు చేస్తున్న క్యారెక్టర్లు గాని ప్రేక్షకుడికి పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వడం లేదు. ఇక ప్రస్తుతం ఓటిటి అందుబాటులోకి రావడంతో ఇండియాలో ఏ భాషలో సినిమాలైనా సరే అందరికీ అవలేబుల్ లో ఉంటున్నాయి. కాబట్టి ఆ సినిమాలన్నింటిని మన ప్రేక్షకులు చూసి మన హీరోలు కూడా ఇతర భాషల హీరోల మాదిరిగా పర్ఫామెన్స్ చేస్తే బాగుండేదనే ఓ చిన్నపాటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు మన హీరోలకు ఎప్పటికప్పుడు పోటీ ఉంటుంది.
గతంలో మన హీరోలకు యాక్టింగ్ చేయడం రాదు అంటూ తమిళ్ వారు చాలా వరకు కామెంట్లు చేసేవారు. ఎందుకంటే మన దగ్గర రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఆరు పాటలు, నాలుగు ఫైట్ లతో సినిమాలైతే వచ్చేవి. దాని వల్లే ఇతర ఇండస్ట్రీ వాళ్ళు మన వాళ్ళను కామెంట్స్ చేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది మన సినిమాలే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో అన్ని బాగున్నప్పటికి మన హీరోలు ఎంచుకుంటున్న పాత్రల్లో వైవిధ్యం లోపిస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి.
తమిళ్ హీరోలు ఎలాంటి పాత్రనైనా సరే దానికి ప్రాణం పోసి అందులో జీవించేసి సినిమాను విజయ తీరాలకు చేస్తుంటారు.
కానీ మన హీరోల్లో కొందరు ఇప్పటికీ బిలియనీర్ గా, ఒక గొప్పింటి కుర్రాడిగా, హీరోయిన్ల వెనుక తిరిగే ఆకతాయి కుర్రాడు ల కనిపిస్తున్నారు అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఒకప్పటి తో పోలిస్తే మన పెద్ద హీరోలు అణగారిన వర్గాలకు చెందిన కుర్రాడిలా కనిపిస్తూ మట్టిలో దొర్లుతూ డి గ్లామరైజ్డ్ పాత్రలను సైతం చేస్తున్నారు. కొంతవరకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమాలను ఎంచుకొని చేస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు హీరోల క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా వరకు చేంజ్ అయ్యారు. కానీ తమిళ్ హీరోలు మాత్రం ఎప్పటి నుంచో ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్లకు మన సినిమాలు పెద్దగా కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇతర భాషల ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నాయి.
మన హీరోలు ఇంకా డెప్త్ స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకొని ఒక నార్మల్ కుర్రాడు ఎలాగైతే ఉంటాడో అలాంటి పాత్రలను పోషించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఒక రకంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో మన హీరోలు సైతం డౌన్ టు ఎర్త్ సినిమాలనే చేసుకుంటూ వస్తున్నారు. అది తమిళ హీరోలకి నచ్చడం లేదు ఇంతకుముందు వాళ్లకు మనల్ని విమర్శించడానికి ఏదో ఒక కారణం ఉండేది. కానీ ఇప్పుడు ఏ కారణం లేదు కాబట్టి వాళ్లు మనవాళ్లను విమర్శించే అవకాశం లేకుండా పోతుంది. మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ పొజిషన్లో ఉంది. అలాగే మన నటులు కూడా రాబోయే రోజుల్లో నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసి టాప్ యాక్టర్స్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు...