రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లను పెట్టి అలాంటి కథలతో సినిమా చేయొచ్చుగా...
రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్తున్న రామ్ చరణ్ కి సుకుమార్ 'రంగస్థలం' సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న చిట్టిబాబు అనే పాత్ర రాశాడు. చెవిటివాడి పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టాడు.
ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే కమర్షియల్ ఫార్మాట్లోనే చేయాలనే ఆలోచనలో మన దర్శక నిర్మాతలు ఉండేవారు. కొన్ని దశాబ్దాల పాటు మన డైరెక్టర్లు అదే పాటర్న్ లో సినిమాలు చేసుకుంటు వచ్చారు. ఈ మధ్యకాలంలో హీరోలు సెలెక్ట్ చేసుకుంటున్న కథలను చూస్తే నిజంగా వాళ్ళను మెచ్చుకోవాలి. దర్శకులు హీరోలకు తగ్గట్టుగా డిఫరెంట్ కథలను రాయడంలో ఎక్కడో ఒక దగ్గర ఫెయిలవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు ఎలాంటి పాత్రలనైనా సరే అలవోకగా చేసేస్తూ ప్రేక్షకుల్లో అటెన్షన్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతూనే ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ కోసం డిఫరెంట్ పాత్రలను రాస్తే ఆ సినిమా రీచ్ ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్తున్న రామ్ చరణ్ కి సుకుమార్ 'రంగస్థలం' సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న చిట్టిబాబు అనే పాత్ర రాశాడు. చెవిటివాడి పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టాడు. ఆ పాత్రలో రామ్ చరణ్ కనిపించలేదు. చిట్టిబాబు పాత్ర మాత్రమే ఎలివేట్ అయింది. అలాగే 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సైతం మాస్ పర్ఫామెన్స్ ను ఇచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం 'దేవర' సినిమాతో మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే వీళ్ళందరు గొప్ప నటులే అయినప్పటికి వాళ్ల క్యారెక్టర్ ని పూర్తిగా ఎలివేట్ చేసే పాత్రలు దొరకడం లేదు. రామ్ చరణ్ తో ఒక జేమ్స్ బాండ్ తరహా సినిమాలను రాస్తే బాగుంటుంది.
అల్లు అర్జున్ తో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తే అతనిలోని పూర్తి స్థాయి నటుడు మనం చూడొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ తో స్పైడర్ మాన్ తరహా సినిమా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి దర్శకులు మన హీరోలను కొత్త యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే గొప్ప విజయాలను సాధిస్తారు. అలాగే హీరో కెరియర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ గా నిలిచే పాత్రలను రాసినప్పుడే దర్శకుడు పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతాడని మరికొంతమంది చెబుతున్నారు.
ఏది ఏమైనా కూడా దర్శకులు ఇప్పుడు మారాల్సిన అవసరమైతే ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. అలాగే మన సినిమాలు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. కాబట్టి మన దర్శకులు ఇకమీదట రాయబోయే కథల విషయంలో గానీ, హీరోల క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని మరింత డెప్త్ తో రాస్తే బాగుంటుంది. రాబోయే రోజుల్లో దర్శకులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని సినిమాలను చేస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్లు దక్కుతాయి...