లావ‌ణ్య‌తో మెగా ప్రిన్స్ విదేశీ ట్రిప్‌.. క్యూట్ వాయువ్ తేజ్ అల్ల‌రే అల్ల‌రి!

ఈ ట్రిప్‌లో వరుణ్ తేజ్ తన గారాల కుమారుడు వాయువ్ తేజ్ కి సంబంధించిన క్యూట్ ఫొటోను కూడా అభిమానుల కోసం షేర్ చేసారు.

Update: 2026-09-19 02:48 GMT

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటలీలోని అత్యంత‌ సుందరమైన‌ ప్రదేశాలకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ``ఇటలీ, లేట్లీ`` అనే క్యాప్షన్‌ను జతచేశారు. ఈ ఫొటోల్లో వరుణ్ తేజ్ తన సతీమణి లావణ్య త్రిపాఠితో కలిసి ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు.

 

ఈ పోస్ట్‌పై అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తూ తమ ప్రేమను కురిపిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ పోస్ట్‌పై స్పందిస్తూ `సంతోషం` అని కామెంట్ చేశారు. ఇక లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జోడీని అభిమానులు `క్యూట్ పెయిర్`.. `బ్యూటిఫుల్ ఫ్యామిలీ` అంటూ ప్రశంసిస్తున్నారు. నిహారిక కొణిదెలతో పాటు పలువురు నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ ట్రిప్‌లో వరుణ్ తేజ్ తన గారాల కుమారుడు వాయువ్ తేజ్ కి సంబంధించిన క్యూట్ ఫొటోను కూడా అభిమానుల కోసం షేర్ చేసారు. బేబి బోయ్ ఎంతో అందంగా, క్యూట్ అల్లరితో తన కుటుంబంలో సందడి చేస్తున్నాడ‌ని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిన్నారి అల్లరితో ఆ ఇంట ఎప్పుడూ నవ్వులు విరుస్తున్నాయని అభిమానులు మురిసిపోతున్నారు.

 

ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా నటించిన `కొరియన్ కనకరాజు` సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్-కామెడీ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమా విజయంతో వచ్చిన అపారమైన ఆనందోత్సాహం నుంచి వరుణ్ తేజ్ ఇంకా పూర్తిగా రిలీవ్ కాలేదనే చెప్పాలి.

 

ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో ఉండగానే తదుపరి చిత్రాలపై దృష్టి సారించే ముందు వరుణ్ తేజ్ తన భార్య పిల్లలతో కలిసి ఇలా ఇటలీకి సరదాగా ఫ్యామిలీ ట్రిప్ వెళ్లారు. అక్కడ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా, ఆనందంగా గడిపిన అత‌డు త్వరలోనే ఈ విహారయాత్రను ముగించుకుని తిరిగి తన బిజీ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.

 

వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించి కథలను పరిశీలిస్తున్నారని..త్వరలోనే తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ నుంచి తదుప‌రి సినిమాలపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News