డైరెక్టర్ గా సైలెంట్ అయిన స్టార్!
శాండిల్ వుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి.
శాండిల్ వుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి. `కాంతార` తెచ్చిన ప్రభంజనం ఒకెత్తయితే? ఆ తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `కాంతార: చాప్టర్ 1` బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం మరొ ఎత్తు. ఈ ప్రీక్వెల్‌తో రిషబ్ దర్శకత్వ పటిమ, నటనను మరోస్థాయికి తీసుకెళ్లారు. అయితే ఈ విజయం తర్వాత కూడా రిషబ్ శెట్టి మీడియా హడావుడికి దూరంగా, సైలెంట్‌గా ఉండటం ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఒక సినిమా భారీ విజయం సాధించగానే వరుసగా క్రొత్త ప్రాజెక్టులు ప్రకటించి వార్తల్లో నిలవడం ఇండస్ట్రీలో కనిపిస్తుంది.
కానీ రిషబ్ శెట్టి శైలి పూర్తిగా భిన్నమైనది. `కాంతార: చాప్టర్ 1` సాధించిన మైలురాయి లాంటి విజయం ఆయన బాధ్యతను మరింత పెంచింది. విజయోత్సవాల ఆర్భాటంలో తేలిపోకుండా తదుపరి ఏ సినిమా చేసినా రాజీ పడకూడదనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తదుపరి క్రియేటివ్ ప్రాజెక్ట్ కోసం సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని తెలిసింది. మరోవైపు నటుడిగా రిషబ్.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం `జై హనుమాన్` సీక్వెల్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
భారీ విజువల్స్, సాంస్కృతిక మూలాలు ఉన్న కథలో రిషబ్ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు శ్రమిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతల ఒత్తిడి నుంచి కాస్త విరామం పొంది నటుడిగా పూర్తిగా ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టడం కూడా కామ్‌గా ఉండటానికి ప్రధాన కారణం. ఆ రకంగా రిషబ్ శెట్టి సైలెంట్ కావడం వెనుక పక్కా వ్యూహం దాగి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతటి విజయం వచ్చినా? తొందరపడి కథలను ఓకే చేయకుండా ప్రేక్షకులకు మళ్లీ అంతకుమించిన అనుభూతిని ఇచ్చే ప్రాజెక్ట్‌లనే ఎంచుకోవాలని రిషబ్ కనిపిస్తున్నారు.
అనవసరమైన ప్రచారాలకు, సోషల్ మీడియా హడావుడికి దూరంగా ఉంటూ తనలోని సృజనాత్మకతను మరింత పదును పెట్టుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. నిశ్శబ్దంగా పని చేసి కంటెంట్‌తోనే బాక్సాఫీస్ వద్ద సమాధానం చెప్పడం రిషబ్ నైజం. మరి మరో కొత్త కథతో దర్శకుడిగా ఎప్పుడు ముందుకు వస్తారు? లేక నటుడిగా మరిన్ని విలక్షణమైన పాత్రలు పోషిస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే ఎలాంటి హడావుడి లేకుండా పూర్తి పరిపక్వతతో రిషబ్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడంలోనే ప్రత్యేకత కనిపిస్తోంది.
మొత్తానికి `కాంతార: చాప్టర్ 1` సక్సెస్ తర్వాత డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి సైలెంట్ అవ్వడం అనేది ఒక రకంగా మరో పెద్ద తుఫానుకు ముందు ప్రశాంతత లాంటిదేనని చెప్పొచ్చు. విజయం ఇచ్చిన గర్వం తలకెక్కించుకోకుండా తదుపరి అన్వేషణ కోసం రిషబ్ నిశ్శబ్ద సాధన పరిశ్రమకు శుభపరిణామమే. `జై హనుమాన్ ` తో పాటు రాబోయే రోజుల్లో రిషబ్ ప్రకటించబోయే కొత్త ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో? చూడటానికి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు!