వెట్టువంలో అక్కినేని కోడలు.. ఈసారి లెక్క పూర్తిగా వేరట..

కేవలం హీరోతో లవ్ సీన్స్ కే పరిమితం కాకుండా.. అవసరమైతే తానే రంగంలోకి దిగి ఫైట్లు కూడా చేస్తుందట. ఆ సినిమా ప్రమోషన్స్‌లో శోభిత షేర్ చేసుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారాయి.

Update: 2026-09-18 10:27 GMT

చాలా సినిమాల్లో హీరో ఫైట్లు చేస్తుంటే.. హీరోయిన్ మాత్రం అతడి చుట్టూ తిరుగుతూ ఎమోషనల్ సీన్లకే పరిమితమవుతుంటుంది. కానీ ఈసారి ఆ లెక్క మారుబోతుందంటోంది అక్కినేని కోడలు, హీరోయిన్ శోభిత ధూళిపాళ. వెట్టువం మూవీలో ఆమె రోల్ పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. కేవలం హీరోతో లవ్ సీన్స్ కే పరిమితం కాకుండా.. అవసరమైతే తానే రంగంలోకి దిగి ఫైట్లు కూడా చేస్తుందట. ఆ సినిమా ప్రమోషన్స్‌లో శోభిత షేర్ చేసుకున్న ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ గా మారాయి.

కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న సినిమానే వెట్టువం. నీలం ప్రొడక్షన్స్, లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఆ సినిమాలో ఆర్య, వీఆర్ దినేష్ తోపాటు శోభిత కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా ది వరల్డ్ ఆఫ్ వెట్టువం బీటీఎస్ కంటెంట్‌ ను మేకర్స్ రిలీజ్ చేయగా, ఆ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌ లో శోభిత తన రోల్ రథి గురించి మాట్లాడారు.

సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోలకు ఎక్కువగా ఫైట్స్ ఇస్తారని.. హీరోయిన్లకు ఎమోషనల్ సన్నివేశాలు ఇస్తారని శోభిత చెప్పారు. కానీ వెట్టువంలో అలా ఉండదని తెలిపిన ఆమె, తన పాత్రే గొడవలకు కారణమవుతుందని చెప్పుకొచ్చారు. రథి రోల్ చాలా ధైర్యంగా ఉంటుందట. తనకు ఏం కావాలో అది సాధించుకోవడానికి వెనుకాడదట. ఎలాంటి ఫిర్యాదులు, నిందలు లేకుండా తన జీవితాన్ని తానే నడిపించుకునే మహిళగా రథి పాత్ర ఉంటుందని చెప్పారు శోభిత.

మహిళల్లో ఉండే మరో స్ట్రాంగ్ యాంగిల్ ను చూపించే అవకాశం దక్కిందని శోభిత చెప్పడం గమనార్హం. అయితే తన రియల్ లైఫ్ కు రథి రోల్ కు ఏమైనా కంపేరిజన్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ గా రెస్పాండ్ అయ్యారు. ప్రతి రోల్ లో నటుడికి ఎంతో కొంత భాగం ఉంటుందని చెప్పింది. మనుషులంతా ఒకే సముద్రంలోని అలల లాంటివారని.. రూపాలు మాత్రమే వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అందుకే చేసే ప్రతి పాత్రతోనూ ఏదో ఒక విధంగా ఆమె కనెక్ట్ అవుతారట.

ఫ్యూచర్ లో తాను నెగెటివ్ రోల్ చేసినా.. అందులో కూడా తనలోని ఏదో ఒక యాంగిల్ కనిపిస్తుందని శోభిత చెప్పారు. పాత్రలను ముందుగానే జడ్జ్మెంట్ ఇవ్వకుండా వాటిని అర్థం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇక వెట్టువంతో పా.రంజిత్‌ తో కలిసి వర్క్ చేస్తున్న శోభిత, మరోవైపు దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో మరో ప్రాజెక్ట్ చేస్తోంది. ఇప్పటికే వారిద్దరూ పొన్నియన్ సెల్వన్ మూవీ కోసం వర్క్ చేసిన విషయం తెలిసిందే.

ఇక పూర్తిగా భిన్నమైన కథల్లో పనిచేసే ఛాన్స్ రావడం ప్రతి క్యాస్టింగ్ డ్రీమ్ అని శోభిత అన్నారు. రంజిత్, మణిరత్నం లాంటి ఇద్దరు ప్రముఖ దర్శకులతో కలిసి వర్క్ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో తన రోల్ కీలకంగా ఉండనుందని చెప్పారు. మరి వెట్టువం మూవీతో శోభిత ధూళిపాళ్ల ఎలాంటి హిట్ అందుకుంటారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News