ఉస్తాద్..సెకండ్ సాంగ్ పవన్ ఎలివేషన్స్ పీక్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వచ్చేస్తోదంటే ఫ్యాన్స్‌లో ఉండే ఆ క్రేజే వేరు. థియేటర్ల వద్ద జరిగే హంగామా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది.;
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వచ్చేస్తోదంటే ఫ్యాన్స్‌లో ఉండే ఆ క్రేజే వేరు. థియేటర్ల వద్ద జరిగే హంగామా నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఏ హీరో సినిమా సందడి చేస్తూ పవన్ ఎంట్రీ ఇచ్చాడంటే ఆ కథే వేరుగ ఉంటుంది. ఆ వైబ్ ఫ్యాన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. `ఓజీ`లో ఓ రేంజ్ పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్ ఇప్పుడు `ఉస్తాద్ భగత్‌సింగ్` కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరిశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. పవన్, హరీష్ శంకర్‌ల కలయికలో వచ్చిన మూవీ `గబ్బర్‌సింగ్`.
ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని సాధించిందో..పవన్ అభిమానులకు ఎలాంటి ఆనందాన్ని కలిగించిందో అందరికి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత అదే కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఉస్తాద్ భగత్‌సింగ్` అదే స్థాయి మ్యాజిక్‌ని రిపీట్‌చేస్తుందని ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందులోనూ పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండటంతో అబిమానులు అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీని మార్చి 26న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. రామ్‌చరణ్ `పెద్ది` `ఉస్దాద్ భగత్‌సింగ్` కోసం వెనక్కి తగ్గడంతో మెగా ఫ్యాన్స్‌కి పండగ ముందే రాబోతోంది. `గబ్బర్‌సింగ్`లో దేవీ అందించిన ఆడియో.. ఆ పాటల్లో పవన్ వేసిన మాసీవ్ స్టెప్స్ హైలైట్‌గా నిలవడం తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని `ఉస్తాద్ భగత్‌సింగ్`లోనూ పవన్ చేత మాసీవ్ స్టెప్స్ వేయిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన `దేఖ్ లేంగే సాలా`..ఆ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పాటలో పవన్ వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సాంగ్ అప్ డేట్ వచ్చేసింది. ఇందులో పవన్ ఎలివేషన్స్ పీక్స్‌లో ఉంటాయిని, థియేటర్లలో అభిమానులు ఓ రేంజ్‌లో రచ్చ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. `ఏ తరమైనా నీ తరమే.. మా గుండెల్లో నీ స్థానం సుస్థిరమే..` అంటూ సాగే లిరిక్స్ పవన్ మాస్ ఇమేజ్‌ను, తనకున్న క్రేజ్‌కు పీక్స్‌కు తీసుకెళుతుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
`గబ్బర్‌సింగ్` పాటలకు థియేటర్లలో పూనకాలతో ఫ్యాన్స్ ఊగిపోయినట్టుగానే `ఉస్తాద్ భగత్‌సింగ్`లోని పాటలకు ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని, థియేటర్లలో ఈ పాటలు ఓ రేంజ్‌లో రచ్చ చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు, అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వడం గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. సినిమా ఏరేంజ్‌లో ఉంటుందన్నది తెలియాలంటే మార్చి 26 వరకు వేచి చూడాల్సిందే.