స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన గుసగుస వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో సడన్ గా చిన్న కుదుపు వచ్చింది.;

Update: 2025-12-17 03:56 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన గుసగుస వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో సడన్ గా చిన్న కుదుపు వచ్చింది. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించేశారు, ఫ్యాన్స్ కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో, హీరో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చిత్ర యూనిట్ ను టెన్షన్ లో పడేసింది.

అసలు విషయం ఏంటంటే.. సదరు స్టార్ హీరో రీసెంట్ గా సినిమాలోని కొన్ని కీలక భాగాలను, ఎడిట్ చేసిన రషెస్ ను చూసుకున్నారట. అయితే దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆయనకు ఎందుకో అంతగా నచ్చలేదని తెలుస్తోంది. కథనంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఆయనకు కలిగిందట. కొన్ని సీన్స్ లో ఎమోషన్ పండలేదని, మరికొన్ని చోట్ల తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఎలివేషన్ రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఈ విషయం మీద దర్శకుడితో హీరో సీరియస్ గానే చర్చించారట. కేవలం అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, ఎక్కడెక్కడ మార్పులు చేయాలో స్పష్టంగా సూచించారట. హీరో గారు చెప్పిన తర్వాత ఇక కాదనలేరు కదా. ఆయన సూచనల మేరకు స్క్రిప్ట్ లో చిన్నపాటి మార్పులు చేసి, ఆయా సన్నివేశాలను మళ్ళీ ఫ్రెష్ గా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. డైరెక్టర్ ఇప్పుడు ఆ పనిలోనే బిజీ అయిపోయారు.

దీంతో ఇప్పుడు చిత్ర యూనిట్ హడావిడిగా రీషూట్ కు ఏర్పాట్లు చేస్తోంది. దీనిని ప్యాచ్ వర్క్ అని బయటకు చెబుతున్నా, జరుగుతోంది మాత్రం రీషూట్ అని ఇన్ సైడ్ టాక్. ఉన్న తక్కువ టైమ్ లో, మళ్ళీ నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేసుకుని, అనుకున్న క్వాలిటీతో సీన్స్ తీయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. అయినా సరే, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక హీరో ఈ నిర్ణయం తీసుకున్నారట.

మరోపక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీమ్ మీద ఒత్తిడి ఉంది. ఒకపక్క రీషూట్ చేస్తూనే, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగు పెట్టించాల్సి వస్తోంది. ఏ మాత్రం ఆలస్యం జరిగినా రిలీజ్ డేట్ కు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది. అందుకే రేయింబవళ్లు తేడా లేకుండా యూనిట్ మొత్తం కష్టపడుతోందట. హీరోని సాటిస్ఫై చేయడంతో పాటు, డెడ్ లైన్ లోపు సినిమాను రెడీ చేయడం ఇప్పుడు దర్శకుడి ముందున్న పెద్ద సవాలు.

మరి ఈ లాస్ట్ మినిట్ మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయా అనేది చూడాలి. గతంలో కూడా ఇలాగే రీషూట్లు చేసి హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, అలాగే తేడా కొట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఏది ఏమైనా, అవుట్ పుట్ విషయంలో హీరో కాంప్రమైజ్ కావడం లేదని అర్థమవుతోంది. మరి ఈ టెన్షన్ అంతా ఫలితాన్ని ఇస్తుందో లేదో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News