అతి ఆలోచన చేతులు కాల్చుకునేలా!
ఓ భారీ పాన్ ఇండియా సక్సెస్ అనంతరం తదుపరి ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్త పడటం సహజం. ఎలాంటి స్టార్ కి అయినా తర్వాత చేసే సినిమా? కచ్చితంగా ఆ భారీ విజయాన్ని మ్యాచ్ చేసేలా ఉండాలని భావిస్తారు.;
ఓ భారీ పాన్ ఇండియా సక్సెస్ అనంతరం తదుపరి ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్త పడటం సహజం. ఎలాంటి స్టార్ కి అయినా తర్వాత చేసే సినిమా? కచ్చితంగా ఆ భారీ విజయాన్ని మ్యాచ్ చేసేలా ఉండాలని భావిస్తారు. ఈ క్రమంలో కొంత గ్యాప్ తీసుకుంటారు. సరైన కథ, దర్శకుడు కుదిరే వరకూ వెయిట్ చేస్తారు. అందుకు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ సమయం తీసుకుంటారు. కానీ ఓ పాన్ ఇండియా హీరో ఏకంగా నాలుగేళ్ల పాటు వెయిట్ చేయడమే అతిగా ఉందంటూ ఓ విమర్శ వ్యక్తమవుతోంది.
ఇంత గ్యాప్ ఆస్టార్ ఇమేజ్ పై ప్రభావం చూపిస్తుదంటూ ప్రత్యేక కథనం పేర్కోంటుంది. ఓ పెద్ద విజయం తర్వాత ఇంత వ్యవధి అన్నది మార్కెట్ లో ప్రతికూలత తీసుకొస్తుందని విశ్లేషించారు. ఇంత గ్యాప్ అన్నది ఇండస్ట్రీలో ఓ పెద్ద స్టార్ అయితే ప్రేక్షకులు అంగీకరిస్తారని...ఒక సినిమాతోనే? తానో లెజెండ్ లా ఫీలైతే మాత్రం సన్నివేశం తారుమారవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందంటున్నారు. వాస్తవానికి ఆ హీరో కెరీర్ కి అప్పటి వరకూ సరైన సక్సస్ లు ఏవీ లేవు. ఎంతో కాలంగా పోరాటం చేస్తుంటే? అనూహ్యంగా ఆ చిత్రం పాన్ ఇండియాకి కనెక్ట్ అయింది.
ఆ సినిమాతోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు. కానీ సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకుని సినిమా చేస్తే అదే హీరోని అభిమానులు మర్చిపోయే ప్రమాదం లేకపోలేదు. తాజాగా సెట్స్ లో ఉన్న పాన్ ఇండియా చిత్రం ఆ హీరోపై ప్రతికూల వాతావరణన్నే తీసుకొస్తుంది. ఇప్పటికే సినిమా కంటెంట్ రెగ్యులర్ గా ఉందనే విషయం ప్రచార చిత్రాలతో తేలిపోయింది. మూల కథ ఏమాత్రం కొత్తది కాదని తెలుస్తోంది. ఆ కథని ట్రీట్ చేసిన విధానం కూడా ప్రచార చిత్రాల్లో ఏమంత గొప్ప గా కనిపించలేదు.
రెగ్యులర్ గా ఉందనే విమర్శ మార్కెట్ లోకి వెళ్లిపోయింది. తాజాగా ఆ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఆ చిత్రం ప్రారంభమై నెలలు గడుస్తోన్న నేపథ్యంలో అంతా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చిందను కుంటున్నారు. కానీ అసలు సంగతేంటంటే? ఆ సినిమా షూటింగ్ ఇంత వరకూ సగం కూడా పూర్తి కాలేదుట. 35 నుంచి 40 శాతమే టాకీ పూర్తయిందంటున్నారు. ఇదే నిజమైతే సినిమా రిలీజ్ అవ్వడానికి మరో ఏడాది అయినా సమయం పడుతుంది. ఇంత సమయం తీసుకుని చేసిన సినిమా సక్సెస్ అవ్వకపోతే? అతి ఆలోచనతోఎ చేతులు కాల్చుకున్నట్లే.