చిరు తర్వాత మహేష్ తోనా ?
చేసిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టిన అరుదయిన ఘనత దక్కించుకున్న దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని నెలల తరబడి వేచి చూస్తున్నాడు. సైరా గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం చిన్న రెస్ట్ తర్వాత ఇది మొదలుపెట్టేందుకు ఆల్మోస్ట్ అంతా రెడీ అయినట్టే. ఇదిలా ఉండగా భరత్ అనే నేను తర్వాత తాను చేయబోయే ప్రతి సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో ఉంటానని చెప్పిన శివ అందుకు తగ్గట్టే యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ తో మంచి ప్లానింగ్ లో ఉన్నాడు.
చిరుతో చేయబోయే మూవీకి ఇది పార్ట్నర్ గా ఉండబోతోంది. ఇది కార్యరూపం దాల్చకుండానే మరో వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. మహేష్ బాబు అనిల్ రావిపూడి మూవీ తర్వాత ప్రిన్స్ 27 కోసం ఇప్పటికే పలువురు దర్శకులు రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక్క పరశురామ్ మాత్రమే మంచి లైన్ తో ఇంప్రెస్ చేసినట్టు టాక్ వచ్చింది. గీత ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో రూపొందవచ్చనే మాట కూడా వినిపించింది.
తాజా అప్ డేట్ ప్రకారం ప్రకారం పరశురామ్ కనక మహేష్ ని ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పిస్తే అది కొరటాల సారధ్యంలో పైన చెప్పిన యువసుధ బ్యానర్ లో ఉంటుందట. మరి గీత సంగతేంటి అంటే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయినా ఇదంతా నిజమని చెప్పడానికి లేదు. మహేష్ 27 గురించి ఇప్పటికే చాలా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఇది అందులో ఒకటా లేక నిజంగా చర్చల దశలో వీటి గురించి ప్రోగ్రెస్ ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది