కాజల్-సూర్య లిప్ లాక్ మోసం

Update: 2016-06-25 05:11 GMT
ఈ మధ్య ‘దో లఫ్జోంకీ కహానీ’ సినిమాలో కాజల్ అగర్వాల్-రణదీప్ హుడాల లిప్ లాక్ ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ కిస్ విషయంలో హిందీ ప్రేక్షకులు పెద్దగా ఎగ్జైటవ్వలేదు కానీ.. కాజల్ ను కొన్నేళ్లుగా పద్ధతిగా చూస్తున్న తెలుగు తమిళ ప్రేక్షకులకు మాత్రం ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. ఐతే సౌత్ సినిమాల్లో ఆమె లిప్ లాక్స్ చేయలేదని కాదు. ఆర్య-2.. బ్రదర్స్ లాంటి సినిమాల్లో ఒక్క క్షణం మెరిసి మాయమయ్యే టైపు లిప్ లాక్స్ చేసింది. ఐతే ఆర్య-2 సంగతేమో కానీ.. ‘బ్రదర్స్’ సినిమాలో వచ్చే ఆ అర క్షణం లిప్ లాక్ కూడా ఒరిజినల్ కాదని తేలిపోయింది. ఆ లిప్ లాక్ ఎంత డమ్మీనో చూపిస్తూ లేటెస్టుగా ఓ వీడియో రిలీజ్ చేశారు.

అందులో కాజల్ అగర్వాల్ గ్రీన్ కలర్లో ఉన్న కుషన్ ను ముద్దాడితే.. సూర్య ప్లాస్టిక్ పేపర్ ను కిస్ చేశాడు. వీఎఫ్ఎక్స్ ద్వారా కాజల్-సూర్య నిజంగానే ముద్దు పెట్టుకున్నట్లు సీన్ క్రియేట్ చేశారన్నమాట. సినిమాలో సూర్య కంజాయినల్ బ్రదర్స్ గా నటించిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఆ ఇద్దరు బ్రదర్స్.. కాజల్ కలిసి సినిమా చూస్తుండగా.. అల్లరోడైన ఒక సూర్య.. ఇంకో సూర్యకు కాజల్ కు తెలివిగా లిప్ లాక్ చేయిస్తాడు. ఈ సీన్ చూస్తే కాజల్-సూర్య నిజంగానే లిప్ లాక్ చేసినట్లు కనిపిస్తుంది కానీ.. ఒరిజనల్ గా ఏం జరిగిందన్నది ఈ మేకింగ్ వీడియో ద్వారా బయటికి వచ్చింది. మనం చూసే ముద్దుల్లో ఎంత మర్మం ఉందో చెప్పడానికి ఈ వీడియోనే ఉదాహరణ. ఇలాంటి ఎన్ని ముద్దులకు మనం మోసపోయామో.
Full View

Tags:    

Similar News