మినీ ఫ్రాక్‌లో ఉప్పెన గాళ్ కవ్వింత
ఎరుపు రంగు గిఫ్ట్ ప్యాక్ లతో అందమైన అమ్మాయి.. శాంటా క్యాప్.. స్ట్రాప్ లెస్ వైట్ మినీ డ్రెస్ లో హొయలుపోతూ కనిపిస్తోంది.;
ఎరుపు రంగు గిఫ్ట్ ప్యాక్ లతో అందమైన అమ్మాయి.. శాంటా క్యాప్.. స్ట్రాప్ లెస్ వైట్ మినీ డ్రెస్ లో హొయలుపోతూ కనిపిస్తోంది. ఆ అందమైన మోములో కవ్వింత, బాడీ లాంగ్వేజ్ లో తుళ్లింత కుర్రకారును విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. క్రిస్మస్ పార్టీని చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్టే కనిపిస్తోంది ఈ బ్యూటీ. అలా అందంగా ఉల్లాసంగా బోల్డ్ గా ఫోజులిచ్చిన ఈ అందాల సోయగం ఎవరో ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు.
ఉప్పెన గాళ్ కృతి శెట్టి. వైట్ హాఫ్ షోల్డర్ మినీ ఫ్రాక్ లో గుబులు పుట్టిస్తున్న ఈ బ్యూటీ క్రిస్మస్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. కృతి చూడటానికి ఎంత సింపుల్ గా కనిపిస్తోందో, అంతకుమించి కవ్విస్తోంది. అందం ఆత్మవిశ్వాసం ఈ బ్యూటీలో మెండు అని నిరూపిస్తోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, ఉప్పెన తర్వాత ఈ బ్యూటీ ఆశించిన బ్లాక్ బస్టర్లు లేక చతికిలబడింది. అయినా నటిగా అవకాశాలకు కొదవేమీ లేదు. ప్రస్తుతం LIK చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. కార్తీ సరసన నటించిన `వా వాతియార్` విడుదల వాయిదా పడిన తర్వాత కృతి కొంత నీరసపడింది. నిర్మాతలు అప్పులు - ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయలేకపోవడం నిరాశపరిచింది. మరోవైపు కృతి శెట్టి బ్రాండ్స్ లో ను దూసుకుపోతోంది. ఇటీవల పాపులర్ డ్యూరోఫ్లెక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. సోషల్ మీడియాల్లోను వాణిజ్య ప్రకటనలతో ఈ బ్యూటీ ఆర్జిస్తోంది.
ఆన్‌లైన్ వేధింపులపై ఆవేదన:
ఆన్‌లైన్ ద్వేషం, నిరంతర విమర్శలు తన మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి కృతి శెట్టి ఇటీవల మాట్లాడింది. ట్రోలింగ్, చెడు మాటలు తనను ఎంతగా వేధించాయో కూడా వెల్లడించింది. ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకోలేక, నిరంతరం ప్రజల జడ్జిమెంట్లు వినలేక చాలా ఆవేదనకు గురయ్యానని కృతి వెల్లడించింది. నా అదుపులో ఉండని విషయాలపైనా తిట్లు తిన్నాను. అది నన్ను చాలా వేధించిందని కృతి తెలిపింది. ``కొన్నిసార్లు చాలా తిరస్కరణను ఎదుర్కొంటాము. నేను సాధారణంగా చాలా ఆశావాదిని అయినా .. ఒక్కోసారి నన్ను నేను కోల్పోయినట్టు అనిపిస్తుంది.. అది నిరాశను కలిగిస్తుంది`` అని చెప్పింది. ఇలాంటి సమయాల్లో తన కుటుంబం, సన్నిహితుల మద్దతు, ముఖ్యంగా తన తల్లి మద్దతు తనకు సహాయపడిందని కృతి చెప్పంది.
స్కూల్ డేస్‌లోనే...
కృతి శెట్టి 21సెప్టెంబర్ 2003న కర్ణాటకలోని మంగళూరులో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్తగా రాణిస్తుండగా, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కృతి ముంబైలో పెరిగింది. స్కూల్ డేస్‌లోనే వాణిజ్య ప్రకటనలలో నటించడం కొనసాగించింది.