2025లో అక్కడ బన్నీదే అగ్ర స్థానం!
2025 కొంత మందికి చేదు, మరి కొంత మందికి తీపి జ్ఞాపకాల్ని అందించింది.;
2025 కొంత మందికి చేదు, మరి కొంత మందికి తీపి జ్ఞాపకాల్ని అందించింది. మరి కొన్ని రోజుల్లో ఈ ఏడాది ఎండ్ అయి న్యూయిర్‌కు యావత్ ప్రపంచం స్వాగతం పలకబోతోంది. ఈ సందర్భంగా 2025 సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్ అయిన టాలీవుడ్ స్టార్స్‌కు సంబంధించిన నివేదికని గూగుల్ తాజాగా విడుదల చేసింది. బ్లాక్ బస్టర్ రిలీజ్‌లు, స్టార్‌కున్న బజ్, మాసీవ్ ఫ్యాన్ బేస్ అని పరిగనలోకి తీసుకుంటూనే 2025 అత్యధికంగా గూగుల్‌లో అభిమానులు, సినీలవర్స్‌సెర్చ్ చేసిన స్టార్ల జాబితాని విడుదల చేసింది.
ఈ లిస్ట్‌లో టాలీవుడ్‌కు సంబంధించిన టాప్ స్టార్స్ అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్ టాప్‌లో నిలిచారు. ఈ టాప్ 5లో అత్యధికంగా అభిమానులు సెర్చ్ చేసిన స్టార్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. 2024లో బన్నీ నటించిన `పుష్ప 2` భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడమే కాకుండా అల్లు అర్జున్‌ని వివాదాల్లో నిలిచేలా చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి బన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ సినిమా ప్రీమియర్ కారణంగా జరిగిన తోక్కీసలాటలో ఓ యువతి మృతిచెందడం, ఆమె తనయుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం బన్నీపై కేసు ఫైల్ చేయడం, ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల మధ్య బన్నీ ఒక్క రోజు జైలు జీవితం అనుభవించడం తెలిసిందే. 'పుష్ప2'తో టాక్ ఆఫ్ ది ఇండియా అయ్యారు. దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న బన్నీ అందరి దృష్టిని ఆకర్షించారు. అదే ఫీవర్ 2025 వరు కొనసాగింది.
ఇక 'పుష్ప 2' తరువాత బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టడంతో 2025లో మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండియాగా మారాడు బన్నీ. దీంతో 2025లో గూగుల్‌లో అత్యధికంగా ఆడియన్స్ సెర్చ్ చేసిన హీరోల్లో అల్లు అర్జున్ టాప్‌లో నిలిచాడు. ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడటంతో అట్లీ, బన్నీ ప్రాజెక్ట్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అంతే కాకుండా బన్నీ పవర్ ఫుల్ లైనప్‌తో రెడీ అవుతున్నాడంటూ వర్తలు షికారు చేయడం, త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్‌లో భాగంగ అవుతున్నాడని ప్రచారం జరగడంతో అల్లు అర్జున్ 2025లో గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ సెలబ్రిటీగా నిలిచాడు.
ఇక ఈ లిస్ట్‌లో రెండవ స్థానంలో నిలిచింది ప్రభాస్. కన్నప్ప, బాహుబలి: ది ఎపిక్, ది రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ సిపిమాలతో నెట్టింట ఈ ఏడాది అంతా ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు `వారణాసి`లో నటిస్తున్న విషయం తెలిసిందే. జక్కన్నతో కలిసి తొలి పాన్ ఇండియా మూవీ చేస్తుండటం, ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ దృష్టిని ఆకర్షించడం, ఐమ్యాక్స్ ఫార్మాట్ మూవీ కావడం, అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌తో మహేష్ వార్తల్లో నిలిచాడు. `ఓజీ`తో పవన్, `వార్ 2`తో ఎన్టీఆర్ ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ పెర్చడ్ టాలీవుడ్ స్టార్స్‌గా నిలవడం విశేషం.