రామాయ‌ణ‌కు తెలుగు రాష్ట్రాల్లో నో బ‌జ్‌?

వాల్మీకి రాసిన సుంద‌ర కావ్యం `రామాయ‌ణం`. ఇందులో మొత్తం ఏడు కాండాలున్నాయి.;

Update: 2026-02-11 15:30 GMT

వాల్మీకి రాసిన సుంద‌ర కావ్యం `రామాయ‌ణం`. ఇందులో మొత్తం ఏడు కాండాలున్నాయి. బాల కాండ‌, అయోధ్య కాండ, అర‌ణ్య కాండ‌, కిష్కిందకాండ‌, సుంద‌ర కాండ‌, యుద్ధ కాండ‌, ఉత్త‌ర‌కాండ‌. కొంత మంది మేక‌ర్స్ ఒక్కొ కాండని తీసుకుని రామ‌య‌ణం మీద సినిమాలు చేశారు. కొంత మంది సంపూర్ణ రామ‌య‌ణం చేస్తే కొంత మంది అర‌ణ్య కాండ‌, యుద్ధ కాండ‌ని తీసుకుని మూవీస్‌ చేశారు. అర‌ణ్య కాండ‌, యుద్ద కాండ‌ల నేప‌థ్యంలో ఇటీవ‌ల ప్ర‌భాస్ న‌టించిన `ఆదిపురుష్‌` రూపొంద‌డం తెలిసిందే.

అయితే ఇప్ప‌డు బాలీవుడ్‌లో సంపూర్ణ రామాయ‌ణ కావ్యాన్ని భారీ కాన్వాస్‌పై అత్యంత భారీ స్థాయిలో న‌మిత్ మ‌ల్హోత్రా, హీరో య‌ష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలు రూపొందుతున్న ఈ సినిమాని ద‌ర్శ‌కుడు నితేష్ తివారీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సాయి ప‌ల్ల‌వి సీతారాములుగా న‌టిస్తుండ‌గా ఇత‌ర పాత్ర‌ల్లో స‌న్నీ డియోల్‌, లారా ద‌త్తా, అరుణ్ గోవిల్, ర‌కుల్ ప్రీత్ సింగ్, ర‌వి దూబే, కాజ‌ల్‌, ఇందిరా కృష్ణ‌న్‌, వివేక్ ఓబెరాయ్‌, శోభ‌న త‌దిత‌రులు న‌టిస్తున్నారు.

హాలీవుడ్ టెక్నీషియ‌న్‌ హ‌న్స్ జిమ్మ‌ర్‌, ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ విష‌యంలో తెలుగు ఆడియ‌న్స్ చాలా అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది. కార‌ణం తెలుగు న‌టీన‌టుల‌కు, స్టార్ల‌కు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌కు ఈ సినిమాలో చోటు ద‌క్క‌లేదు. ర‌న్‌బీర్ క‌పూర్ శ్రీ‌రాముడిగా, సాయి ప‌ల్ల‌వి సీత‌గా, యష్ రావ‌ణుడిగా, విజ‌య్ సేతుప‌తి విభీష‌ణుడిగా న‌టిస్తున్నార‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శోభ‌న‌ల‌కు ప్రియారిటీ లేని పాత్ర‌లిచ్చార‌ని, సినిమా రెండు భాగాల్లోనూ హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ స్టార్ల‌కే ప్రాధాన్య‌త ఇచ్చి తెలుగు వారిని ప‌క్క‌న పెట్ట‌డ‌మే తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌డం లేద‌ట‌.

పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం మొద‌లైన త‌రువాత అత్య‌ధిక శాతం క‌లెక్ష‌న్‌లు తెలుగు రాష్టాల నుంచే వ‌స్తున్నాయి. ఇంత పెద్ద మార్కెట్‌ని మ‌ర్చిపోయి బాలీవుడ్ మేక‌ర్స్ కేవ‌లం త‌మిళ‌, క‌న్న‌డ యాక్ట‌ర్స్‌ని మాత్రమే రామాయ‌ణ కోసం తీసుకుని తెలుగు వాళ్ల‌ని ఎలా మ‌ర్చిపోయార‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాల్లో `రామాయ‌ణ‌`పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని, వ‌సూళ్ల ప‌రంగా ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇదిలా ఉంటే అత్యంత ఆధునిక టెక్నాల‌జీని ఉప‌యోగించి హాలీవుడ్ టెక్నిష‌యిన్‌ల‌తో పాటు భార‌తీయ సాంకేతిక నిపుణుల సార‌థ్యంలో ఈ వెండితెర దృశ్య కావ్యాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్‌కానున్న ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ ఈ ఏడాది న‌వంబ‌ర్ 7న దీపావ‌ళి సంద‌ర్భంగా భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రెండ‌వ భాగం 2027 దీపావ‌ళికి రానుంది.

Tags:    

Similar News