సక్సెస్‌ఫుల్ సర్జరీ తర్వాత హైదరాబాద్‌లో చరణ్: ఇక RC17పైనే దృష్టంతా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి అయిన గాయానికి సంబంధించిన సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో.. అత‌డు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు.

Update: 2026-07-30 12:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతికి అయిన గాయానికి సంబంధించిన సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో.. అత‌డు మళ్లీ హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో అభిమానులు తీవ్ర ఉపశమనం పొందుతూ సోషల్ మీడియా వేదికగా చరణ్ దీనినుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు రామ్ చరణ్ తక్షణ కర్తవ్యం ఏమిటనేది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో కోలుకున్న వెంటనే చెర్రీ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించనున్నారు.



 


గాయం నుంచి కోలుకున్న తర్వాత రామ్ చరణ్ మెయిన్ ఫోకస్ విజనరీ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోయే మూవీపైనే ఉండనుంది.'రంగస్థలం' వంటి ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై (RC17) అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే సుకుమార్ పూర్తి స్థాయి బౌండ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి చరణ్‌కి వినిపించారని.. త్వరలోనే ప్రాజెక్ట్‌కు సంబంధించిన తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారని సమచారం. ఈ సంచలన కాంబినేషన్‌కి రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (డిఎస్‌పి) సంగీతం అందించనుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఊపునిస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల సమయంపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక స్పష్టమైన ప్లాన్ నడుస్తోంది. 2027 చివరి నాటికి లేదా 2028 మార్చి నాటికి #RC17 చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని సుకుమార్ టీమ్ భావిస్తోందట. దానికి తగినట్లుగానే రామ్ చరణ్ డేట్స్ - షూటింగ్ షెడ్యూళ్లను మైక్రో లెవెల్‌లో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాపుల‌ర్ ఫ్యాన్ పేజీలు, సినీ విశ్లేషకులు ఈ సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో నిరంతరం ఈ ప్రాజెక్ట్ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా కామెంట్ సెక్షన్లలో ఈ సినిమాకు సంబంధించిన చర్చలు హోరెత్తుతున్నాయి. `రంగస్థలం`లో చిట్టిబాబుగా రగ్గడ్ మాస్ లుక్‌లో కనిపించిన చరణ్‌ను ఈసారి సుకుమార్ మరింత స్టైలిష్‌గా చూపిస్తారా లేక మళ్లీ విభిన్నమైన మాస్ షేడ్స్‌లో ప్రెజెంట్ చేస్తారా? అనే దానిపై నెటిజన్లు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కథానాయికగా కియారా అద్వానీ లేదా శ్రద్ధా కపూర్ అయితే బాగుంటుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ఊరమాస్ మ్యూజిక్ కోసం సంగీత ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సాధారణంగానే ఇలాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లు ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన ఫ్యాన్ వార్స్ - బాక్సాఫీస్ రికార్డుల పోలికలపై వాదనలు నడవడం సహజం. అయితే ఎలాంటి పోలికలు ఉన్నా ఓవరాల్‌గా మాత్రం #RC17పై ఉన్న క్రేజ్ - హైప్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ల్యాండ్‌మార్క్ చిత్రాలలో ఒకటిగా దీనిపై చ‌ర్చ సాగుతోంది. రామ్ చరణ్ చేతి పెయిన్ త‌గ్గించుకుని- పూర్తి ఫిట్నెస్‌తో తిరిగొచ్చాక సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

Tags:    

Similar News