మిల్క్ బ్యూటీ వివాదం ముగిసిపోయిందా?

తాజాగా ఈ బ్యూటీ ఖాతాలోకి మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బ్రాండ్ వ‌చ్చి చేరింది. అదే `మైసూర్ సాండ‌ల్ సోప్‌`.;

Update: 2026-02-11 13:30 GMT

సినీ స్టార్లు, సెల‌బ్రిటీలు సినిమాల్లో న‌టిస్తూనే సైడ్ బిజినెస్ కూడా చేస్తుండ‌టం తెలిసిందే. మూవీస్ ప‌రంగా కోట్ల‌ల్లో పారితోషికాలు తీసుకుంటున్న స్టార్స్ దానికి మించి క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ల‌కు ద‌క్కించుకుంటున్నారు. ప్ర‌ముఖ బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌ద్వారా ఆయా కంప‌నీల సేల్స్ త‌మ క్రేజ్‌తో పెంచేస్తున్నారు. టాలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు స్టార్ హీరోలు, హీరోయిన్‌లు, ప్ర‌కాష్ రాజ్‌, సోనూసూద్ లాంటి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లు కూడా బ్రాండ్‌ల‌లో దూసుకుపోతున్నారు. క్రేజీ బ్రాండ్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌లుగా ప‌ని చేస్తున్నారు.

తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ నుంచి నాని వ‌ర‌కు పూజా హెగ్డే నుంచి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వ‌ర‌కు ఇప్ప‌టికే వివిధ బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో కొంత మంది వివాదాల‌ని ఎదుర్కొంటుంటే మ‌రి కొంత మంది మాత్రం వివాదాల‌కు దూరంగా ఉంటూ త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా కూడా ఈ జాబితాలో చేరింది. జ‌ప‌నీస్ కాస్మెటిక్స్ నుంచి ఫాంటా వ‌ర‌కు ప‌దికి పైనే ప్ర‌ముఖ బ్రాండ్‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఖాతాలోకి మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బ్రాండ్ వ‌చ్చి చేరింది. అదే `మైసూర్ సాండ‌ల్ సోప్‌`. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌ముఖ బ్రాండ్‌ల‌లో ఒక‌టిగా పాపులారిటీని, ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని సొంతం చేసుకుని ఇప్ప‌టికీ అదే క్రేజ్‌ని సొంతం చేసుకుని రికార్డు స్థాయిలో సేల్స్ జ‌రుగుతున్న `మైసూర్ సాండ‌ల్ సోప్‌`కు మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఖ‌రారైంది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే `మైసూర్ సాండ‌ల్ సోప్‌` ఉత్ప‌త్తిని ప్ర‌భుత్వ‌మే కొన్ని ద‌శాబ్దాలుగా చూసుకుంటోంది.

అలాంటి ఈ ప్రోడ‌క్ట్‌కు త‌మ‌న్నా అయితే బాగుంటుంద‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం త‌న‌ని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించింది. దీనిపై గ‌త కొంత కాలంగా క‌ర్ణాట‌క‌లో నిర‌స‌న‌లు, విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ ప్రాంతానికి చెంద‌ని వ్య‌క్తిని ఎలా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మిస్తార‌ని, ఆ నిర్ణ‌యాన్ని వెంట‌నే విర‌మించుకోవాల‌ని ప‌లువురు ప్ర‌భుత్వానికి సూచించారు. అయినా స‌రే ప్ర‌భుత్వం ఎన‌క్కి త‌గ్గ‌లేదు. త‌మ‌న్నానే బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మిస్తూ తాజాగా ఆమెతో కాంట్రాక్ట్‌ని కుదుర్చుకోవ‌డం విశేషం.

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. షాహీద్ కాపూర్ `ఓ రోమియో`తో పాటు మ‌రియా ఐపీఎస్‌, వి శాంతారామ్ బ‌యోపిక్‌, సిద్దార్ధ్ మ‌ల్హోత్రా `వీవాన్`, రేంజ‌ర్ సినిమాల్లో న‌టిస్తోంది. ఇందులో షాహీద్ క‌పూర్ హీరోగా విశాల్ భ‌ర‌ద్వాజ్ రూపొందిస్తున్న రొమాంటిక్‌ యాక్ష‌న్ డ్రామా `ఓ రోమియో`లో ఎలాంటి పారితోషికం తీసుకోకుండా త‌మ‌న్నా న‌టించిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News