సూపర్ స్టార్ చేసిన రెండు తప్పులతో...!
బాలీవుడ్‌లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోగా కొనసాగి, ఇండస్ట్రీ హిట్స్ సాధించి, ఇండియా మొత్తం అభిమానులను దక్కించుకున్న సూపర్ స్టార్ అమీర్ ఖాన్.
బాలీవుడ్‌లో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోగా కొనసాగి, ఇండస్ట్రీ హిట్స్ సాధించి, ఇండియా మొత్తం అభిమానులను దక్కించుకున్న సూపర్ స్టార్ అమీర్ ఖాన్. ఈయన నటించిన సినిమాలు, దర్శకత్వం చేసిన సినిమాలు కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను మెప్పించాయి. అమీర్ నటించిన దంగల్ సినిమా చైనాలో ప్రభంజనం సృష్టించిన విషయం తెల్సిందే. అంతటి విజయాలు దక్కించుకున్న మిస్టర్ పర్‌ఫెక్ట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన రెండు తప్పుల కారణంగా కెరీర్ మొత్తం నాశనం అయింది అంటూ ఆయన అభిమానులు స్వయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడు. గొప్ప కథలతో మాత్రమే సినిమాను చేయాలి, అద్భుతంగా ఉండాలి అనే పట్టుదలతో మిస్టర్ పర్‌ఫెక్ట్ అనే పేరు దక్కించుకున్నాడు కానీ కెరీర్‌ను పోగొట్టుకున్నాడు అనేది చాలా మంది మాట.
అమీర్ ఖాన్ కొత్త సినిమాలు..
అమీర్ ఖాన్ చాలా మంది గొప్ప వ్యక్తుల యొక్క బయోపిక్‌లు చేయాలని ఆశ పడ్డాడు. అయితే చాలా మంది బయోపిక్‌లు కమర్షియల్ సినిమాలుగా మల్చడానికి పనికి రావు. ఆ విషయం అమీర్ ఖాన్ ఆ కథలతో చాలా దూరం ప్రయాణించిన తర్వాత, చాలా కాలం సమయం వృదా అయిన తర్వాత తెలుసుకున్నాడు. దాంతో అమీర్ ఖాన్ ప్రకటించిన సినిమాలు కనీసం సెట్స్ పైకి ఎక్కకుండానే క్యాన్సల్ అయ్యాయి అని అందరికీ తెలిసిందే. ఇక చేసిన సినిమాల విషయాల్లోనూ అమీర్ ఖాన్ మిస్టర్ పర్‌ఫెక్ట్ గా ఉండటం వల్ల కథలో ఇన్వాల్వ్ కావడం, దర్శకత్వంలో వేలు పెట్టడం వంటివి చేశాడట. దాంతో సినిమాలు అటకెక్కిన సందర్భాలు ఉన్నాయి, విడుదల అయ్యాక ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ ఈ మధ్య కాలంలో చేసిన ఏ ఒక్క సినిమా హిట్ కాకపోవడంకు కారణం ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ ఉండటం అనేది కొన్ని కొందరి మాట.
మూడో పెళ్లి చేసుకున్న కారణంగా...
ఒకవైపు కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న అమీర్ ఖాన్ ఇదే సమయంలో మూడో పెళ్లి చేసుకోవడం తీవ్ర విమర్శలకు తెర లేపింది. అమీర్ తన వ్యక్తిగత జీవితానికి, సినిమాలకు లింక్ చేయవద్దని అంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మూడో పెళ్లి కారణంగానే అమీర్ ఖాన్ సినిమాలపై దృష్టి పెట్టడం లేదని, అందుకే ఆయన్ను బాలీవుడ్ స్టార్ నిర్మాతలు, దర్శకులు దూరం పెడుతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమీర్ ఖాన్ మూడో పెళ్లి వివాదాస్పదం కావడంతో పాటు, ఇండస్ట్రీలో ఆయన సినిమాలు మరింతగా తగ్గడం వల్ల ఆయన మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతున్నాడని, ఆయన్ను అభిమానించే వారు సైతం తగ్గారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమీర్ ఖాన్ సినిమా అంటే గతంలో తప్పక చూడాలి అనుకున్న వారు ఇప్పుడు చూడక పోయినా పర్వాలేదు, అలాంటి వ్యక్తి సినిమాను చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..
అమీర్ ఖాన్ ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నాడు. ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలు సైతం గొప్ప ఫలితాలను చవిచూడటం లేదు. దాంతో ఆయన రాబోయే రోజుల్లో బుల్లి తెరకు పరిమితం అయితే బాగుంటుంది అనే వారు కొందరు ఉన్నారు. అమీర్ ఖాన్ ఇప్పటికే ఆరు పదుల వయసు దాటేశారు. దాంతో ఆయన హీరోగా ఊహించుకోలేక పోతున్నామని ప్రేక్షకులు అంటున్నారు. వచ్చిన కథలు చేస్తూ ఏడాదికి ఒకటి రెండు సార్లు ప్రేక్షకులను పలకరిస్తే ఏదో ఒక సినిమాతో ఏడాదికో రెండేళ్లకు ఒకసారో హిట్ దక్కే అవకాశం ఉంది. కానీ అమీర్ రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా అన్నట్లుగా విడుదల చేస్తే హిట్ దక్కేది ఎప్పుడు? ఎలా? అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో స్పీడ్ లేకపోవడంతో పాటు, వ్యక్తిగత విషయాల కారనంగా అమీర్ ఖాన్ కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు అనేది సోషల్ మీడియాలో జనాల మాట. అయితే అమీర్ ఖాన్ మరో పదేళ్ల పాటు బాలీవుడ్‌లో టాప్ హీరోగా సినిమాలు చేస్తాడని, ఇక మీదట వరుస సినిమాలు చేస్తాడని ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు.