సత్య vs హీరోయిన్: నువ్వు లావు.. నా నైటీ నీకెలా వస్తుంది?

ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటేనే హీరోయిన్లు చాలా స్టైలిష్ గా ముస్తాబై వచ్చి, నాలుగు రొటీన్ థ్యాంక్స్ లు చెప్పి సైలెంట్ గా వెళ్లిపోవడం అలవాటైన దృశ్యం.

Update: 2026-10-28 04:00 GMT

ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటేనే హీరోయిన్లు చాలా స్టైలిష్ గా ముస్తాబై వచ్చి, నాలుగు రొటీన్ థ్యాంక్స్ లు చెప్పి సైలెంట్ గా వెళ్లిపోవడం అలవాటైన దృశ్యం. ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చిన భామలైతే ఇంకాస్త జాగ్రత్తగా, ఫార్మల్ గా కనిపిస్తుంటారు. శిల్పకళా వేదికపై జరిగిన 'ఆదర్శ కుటుంబం' ఈవెంట్ లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. కమెడియన్ సత్యతో ఆమె చేసిన ఆ సరదా రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈవెంట్ లో యాంకర్ సుమ మైక్ అందుకుని సత్యను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ట్రైలర్ లో మీరు లేడీస్ నైటీ వేసుకుని కనిపించారు కదా, అది ఎక్కడ కొన్నారు అని అడిగింది. దానికి సత్య ఏమాత్రం తడుముకోకుండా, తనదైన అమాయకపు ఫేస్ పెట్టి అది శ్రీనిధిది అంటూ బాంబ్ పేల్చాడు. సత్య అలా అనడమే ఆలస్యం, కింద కూర్చున్న శ్రీనిధి శెట్టి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ కింద నుంచే మైక్ లేకుండా ఒక కౌంటర్ వేసింది.

నువ్వు అంత లావుగా ఉన్నావు, నా నైటీ నీకెలా సరిపోతుంది అంటూ అందరి ముందే గట్టి పంచ్ ఇచ్చింది. ఆమె పంచ్ కు సత్య పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ వెంటనే శ్రీనిధి గురించి చెప్పమంటే, ఆమె నా బ్రో అంటూ ఏకంగా సర్టిఫికెట్ ఇచ్చేశాడు. తెరపై గ్లామరస్ గా కనిపించే ఒక స్టార్ హీరోయిన్, లోకల్ కమెడియన్ మధ్య ఇలాంటి క్యాజువల్ సంభాషణ జరగడం చాలా అరుదు. స్టేజ్ మీదున్న వారితో కింద కూర్చున్న నటి ఇంత ఓపెన్ గా సరదా జోకులు వేసుకున్నారంటే, షూటింగ్ సమయంలో వీళ్ల మధ్య ఎంతటి స్నేహం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

త్రివిక్రమ్ సినిమాల్లో కామెడీ పండాలంటే నటీనటుల మధ్య ఆఫ్ స్క్రీన్ లో ఒక మంచి కంఫర్ట్ జోన్ ఉండాలి. కేజీఎఫ్ లాంటి చిత్రాల్లో చాలా సీరియస్ గా, అరకొర డైలాగులతో కనిపించిన శ్రీనిధిని, ఇక్కడ దర్శకుడు ఎంతగా ఫ్రీ చేశాడో ఈ ఒక్క సీన్ చూస్తేనే తెలిసిపోతోంది. సాధారణంగా స్టార్ హీరో సినిమాలో కమెడియన్ల స్పేస్ వేరుగా, హీరోయిన్ల ట్రాక్ వేరుగా ఉంటుంది.

ఇక్కడ హీరోయిన్ నైటీని కమెడియన్ వేసుకోవడం, దానిపై వీళ్లిద్దరూ ఇలా స్టేజ్ పైనే కౌంటర్లు వేసుకోవడం చూస్తుంటే కథలో వీరిద్దరి కాంబినేషన్ సీన్లు ఏ రేంజ్ లో నవ్వులు పూయించబోతున్నాయో హింట్ దొరుకుతోంది. గతంలో నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాల్లో ఆర్తీ అగర్వాల్, సునీల్ మధ్య ఇలాంటి నేచురల్ బాండింగ్ కనిపించేది. హీరోయిన్ కేవలం పాటల కోసమే కాకుండా కామెడీ ట్రాక్ లోనూ భాగమైనప్పుడు ఆ వినోదం సరికొత్త కిక్ ఇస్తుంది.

సత్య ఫుల్ ఫామ్ లో ఉన్న టైమ్ లో శ్రీనిధి లాంటి నటి కూడా ఆయన టైమింగ్ కు తగ్గట్టు కౌంటర్లు విసరడం ఖచ్చితంగా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. భాష రాకపోయినా తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా, లోకల్ వైబ్ ను ఆమె ఎంత ఈజీగా ఓన్ చేసుకుందో ఈ సరదా గొడవే చాటిచెప్పింది. ప్రమోషన్లలో ప్లాన్ చేసుకుని మాట్లాడే రొటీన్ డైలాగుల కంటే ఇలాంటి స్పాంటేనియస్ మూమెంట్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఆదర్శ కుటుంబంలో పక్కింటి జలగలాంటి సత్య పాత్రకు, హీరోయిన్ స్వర్ణ పాత్రకు మధ్య జరిగే ఆ టామ్ అండ్ జెర్రీ వార్ తెరపై ఏ స్థాయిలో పేలుతుందో చూడాలి.

Tags:    

Similar News