దుమ్మురేపుతున్న ‘భోగి’ పాటలు

శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ఆల్బమ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Update: 2026-10-28 03:33 GMT

శర్వానంద్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ఆల్బమ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సంపత్ నంది దర్శకత్వంలో 1960ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, తాజాగా విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.




 


ఇప్పటివరకు విడుదలైన ‘ఎగిలివారంగ’, ‘అన్నయ్య పానం’ పాటలకు మంచి స్పందన వస్తోంది. ‘ఎగిలివారంగ’ పాట పల్లె వాతావరణాన్ని, తెలంగాణ మట్టి వాసనను ప్రతిబింబిస్తూ అప్పటి గ్రామీణ జీవనశైలిని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించింది. ఇక ‘అన్నయ్య పానం’ పాట చెల్లెళ్లపై అన్నయ్య చూపించే నిస్వార్థమైన ప్రేమ మనసుకు హత్తుకునేలా ప్రజెంట్ చేసింది.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి చంద్రబోస్ సాహిత్యం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ‘అన్నయ్య పానం’ పాటలో అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగం, త్యాగం, విడదీయలేని అనుబంధాన్ని తన పదాలతో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే ‘ఎగిలివారంగ’ పాటలో అప్పటి పల్లె జీవనానికి తన సాహిత్యంతో ప్రాణం పోశారు.

‘ఎగిలివారంగ’ పాటకు నల్గొండ గద్దర్ నర్సన్న, ‘అన్నయ్య పానం’ పాటకు సింగర్ శ్రీకృష్ణ అందించిన గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీతం, సాహిత్యం, గాత్రం కలగలిసి ఈ పాటలకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి.

పాటల్లోని భావోద్వేగాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. శర్వానంద్ తన సహజమైన లుక్‌తో, నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతంగా ఉంది.

దర్శకుడు సంపత్ నంది టేకింగ్ కూడా పాటల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది. 1960ల నాటి పల్లె వాతావరణాన్ని, తెలంగాణ సంస్కృతిని తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటోంది. ఈ రెండు పాటలు చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియా, మిగతా మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో దుమ్మురేపుతున్నాయి.


Full View



Full View


Tags:    

Similar News