డైరెక్టర్ అంటే ఈ రేంజ్ గట్స్ ఉండాలి
సినిమా ఇండస్ట్రీలో ఒక అన్‌రిటెన్ రూల్ ఉంది.. సూపర్ స్టార్ డేట్లు దొరికితే ఎంతటి దర్శకుడైనా తన స్క్రిప్ట్‌ను మార్చేసుకుంటాడు.
సినిమా ఇండస్ట్రీలో ఒక అన్‌రిటెన్ రూల్ ఉంది.. సూపర్ స్టార్ డేట్లు దొరికితే ఎంతటి దర్శకుడైనా తన స్క్రిప్ట్‌ను మార్చేసుకుంటాడు. కానీ కథపై నిజమైన కన్విక్షన్ ఉంటే స్టార్ ఇమేజ్ను కూడా పక్కన పెట్టేయొచ్చని నిరూపించాడు జీతు మాధవన్. మొన్నటివరకు మోహన్ లాల్ తో సినిమా అంటూ పెద్ద ఎత్తున హంగామా నడిచింది. తీరా చూస్తే అంత పెద్ద ప్రాజెక్ట్ ను స్వయంగా రద్దు చేసుకున్నానని ఆయన ఓపెన్ గా చెప్పడం సౌత్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
'రోమాంచం', 'ఆవేశం' లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ఎవరైనా సరే కాంబినేషన్ క్రేజ్ కోసం వెంపర్లాడతారు. మోహన్ లాల్ లాంటి దిగ్గజ నటుడు దొరికినప్పుడు ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలని చూస్తారు. అవసరమైతే యాక్షన్ సీక్వెన్స్‌లను కుదించి, తక్కువ రోజుల్లోనే కానిచ్చేద్దామని ఆలోచిస్తారు. కానీ జీతు మాత్రం ఆ రాజీ మార్గాన్ని ఎంచుకోలేదు. ఈ కథకు భారీగా వర్కింగ్ డేస్ అవసరమని, లాల్ ఏటన్ బిజీ షెడ్యూల్ వల్ల అంత సమయం కేటాయించలేకపోయారని ఉన్నదున్నట్లు చెప్పేశాడు.
అంతేకాదు, ఒకరి కోసం రాసిన కథను మార్కెట్ కోసం మరొకరి చేతిలో పెట్టే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశాడు. మోహన్ లాల్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథను వేరే హీరోతో చేయలేనని తేల్చి చెప్పడం ఆయనలోని నిజమైన ఫిల్మ్ మేకర్ ను చూపిస్తోంది. క్వాలిటీ తగ్గించి, అడ్జస్ట్ అయి తెరకెక్కించడం కంటే అసలు ఆ సినిమానే ఆపేయడం నయమనుకోవడం చిన్న విషయం కాదు. కాంబినేషన్ల వెంట పడే ప్రస్తుత ట్రెండ్‌లో ఇలాంటి క్రియేటివ్ నిజాయితీ చాలా అరుదుగా కనిపిస్తుంది.
కేవలం స్క్రిప్ట్ విషయంలోనే కాదు, క్యాస్టింగ్ ఎంపికలోనూ జీతు మాధవన్ రూట్ పూర్తిగా సపరేట్ గా ఉంది. సూర్య హీరోగా చేస్తున్న 'సీన్' సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ ను విలన్ గా పెట్టడమే ఇందుకు నిదర్శనం. సాధారణంగా సూర్య లాంటి మాస్ హీరోకు ఎదురుగా ఒక పవర్ ఫుల్, భారీ కటౌట్ ఉన్న రొటీన్ విలన్ ను పెడతారు. అలాంటిది చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న ఒక యంగ్ కుర్రాడిని మెయిన్ ప్రతినాయకుడిగా మార్చడం ఒక క్రేజీ ఆలోచన.
సోషల్ మీడియాలో నడిచిన రకరకాల ఫ్యాన్ థియరీలను ఆయన కొట్టిపారేశాడు. సూర్య డబుల్ రోల్ చేస్తున్నాడంటూ వచ్చిన ప్రచారంలో నిజం లేదని తేల్చేశాడు. నస్లెన్ హీరో టీమ్ లో ఉండడని, అతనే అసలైన విలన్ అని క్లారిటీ ఇచ్చాడు. రెగ్యులర్ మూస పద్ధతులను బ్రేక్ చేస్తూ, ఒక అమాయకపు ముఖం వెనుక ఉన్న భయంకరమైన కోణాన్ని చూపించాలనుకోవడం ఆయన విలక్షణమైన టేకింగ్ కు నిదర్శనం.
స్టార్ల కాల్షీట్ల కోసం కథలను చంపేసే రోజుల్లో జీతు మాధవన్ లాంటి మేకర్స్ ధోరణి ఇండస్ట్రీకి ఒక మంచి ఉదాహరణ. కంటెంట్ క్వాలిటీ కోసం సూపర్ స్టార్ సినిమాను వదులుకోవడం, మరోవైపు రొటీన్ విలనిజానికి భిన్నంగా నస్లెన్ లాంటి సాఫ్ట్ యాక్టర్ ను బరిలోకి దించడం నిజంగా పెద్ద డేరింగ్ స్టెప్. డైరెక్టర్ విజన్ ఇంత బలంగా ఉన్నప్పుడు, తెరపై వచ్చే ఫలితం కూడా అంతే ఫ్రెష్ గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక కంటెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.