శ్రీనిధి శెట్టి - త్రివిక్రమ్ మధ్య అసలు ఏమి జరిగింది..!

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయితే చాలు.. అందులో ఏం జరిగిందో తెలుసుకోకుండానే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు.

Update: 2026-10-28 03:53 GMT

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయితే చాలు.. అందులో ఏం జరిగిందో తెలుసుకోకుండానే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో.. కొన్ని సెకన్ల వీడియోలను మాత్రమే కట్ చేసి పెట్టడం వల్ల అసలు విషయం ఒకటైతే, చూసేవాళ్లకు మరోలా అనిపిస్తుంది. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..హీరోయిన్ శ్రీనిధి శెట్టి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన కూడా ఇలాగే అసలు ఏం జరిగింది అన్న సందేహంతోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది.

అసలు విషయానికి వస్తే..విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా హాజరయ్యారు. ఈ సమయంలో శ్రీనిధి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లగా..ఆయన కిందకు వంగడం వీడియోలో కనిపిస్తోంది. అదే సమయంలో శ్రీనిధి కూడా కిందకు వంగి త్రివిక్రమ్ కాళ్లు పట్టుకోవడంతో ఈ వీడియో అందరినీ ఆశ్చర్యపరిస్తోంది.

ఈ చిన్న వీడియోను చూసిన కొందరు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఒకరకంగా మొదటిసారి ఈ వీడియోని చూస్తే ముందుగా త్రివిక్రమ్ శ్రీనిధి కాళ్లు పట్టుకుంటున్నట్టు ఆ తర్వాత శ్రీనిధి త్రివిక్రమ్ కాళ్లు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. కానీ వీడియోని మరోసారి బాగా గమనిస్తే.. త్రివిక్రమ్ కింద ఏదైనా పడిందేమోనని చూస్తున్నట్లు కూడా అనిపిస్తోంది. త్రివిక్రమ్ అక్కడ ఏదో పడితే తీస్తూ ఉండగా అది గమనించిన శ్రీనిధి.. వెంటనే ఆయన కాళ్లు పట్టుకున్నట్లు అర్థమవుతుంది. లేదు అంటే త్రివిక్రమ్ తమాషాకి కూడా ఈ పని చేసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు యాంకర్ సుమ అసలు ఏం జరుగుతుంది అక్కడ అని అన్నారు. మొత్తం పైన ఈ వీడియో ఒక కన్ఫ్యూజన్ తోనే ముగిసింది.

ఇక్కడే సోషల్ మీడియా వీడియోల అసలు సమస్య కనిపిస్తోంది. ఒక సంఘటన జరిగినప్పుడు దాని ముందు, తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి. కేవలం కొన్ని సెకన్ల వీడియోను చూసి ఒక నిర్ణయానికి రావడం సరైన పద్ధతి కాదు. వీడియోను ఎడిట్ చేసి పెట్టినప్పుడు అసలు సందర్భం తెలియకపోవచ్చు. దీంతో సాధారణంగా జరిగిన సంఘటన కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది.

ఇక ఈ కార్యక్రమంలో శ్రీనిధి శెట్టి త్రివిక్రమ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అలాగే వెంకటేష్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.



Tags:    

Similar News