ఓటీటీ బాటపడుతున్న టాలీవుడ్ స్టార్స్?
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కోవిడ్, లాక్‌డౌన్ కారణంగా అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఓటీటీలకు ఒక్కసారిగా ప్రాణమొచ్చింది.;
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కోవిడ్, లాక్‌డౌన్ కారణంగా అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న ఓటీటీలకు ఒక్కసారిగా ప్రాణమొచ్చింది. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలల పాటు అంతా ఇంటికే బందీలైపోవడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఓటీటీలే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి తమ ప్రాభవాన్ని చాటుకున్నాయి. ఈ క్రిటికల్ ఫేజ్‌లో వినోదాన్ని అందించడంతో ప్రేక్షకులు చాలా వరకు ఓటీటీలకు క్రమ క్రమంగా అడిక్ట్ కావడం మొదలు పెట్టారు. దీంతో థియేటర్లకు మించి ఓటీటీలకు ఆదరణ పెరగడం స్టార్ట్ అయింది.
చిన్న చిన్న ఆర్టిస్ట్‌లకు, సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేని వారికి కూడా అక్కడ అవకాశాలు అభించడం మొదలైంది. దీంతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ వెబ్ సిరీస్‌లు, ఓటీటీ మూవీస్ రావడం మొదలైంది. క్రేజీ యాక్టర్లకు కూడా అక్కడ వరుస అవకాశాలు, భారీ ఆఫర్లు లభిస్తుండటంతో ఇప్పుడు చిన్న హీరోలు కూడా అటువైపు అడుగులు వేస్తున్నారు. సూపర్ సుభాష్‌తో సందీప్ కిషన్, ఆనంద్ దేవరకొండ `తక్షకుడు`తో ఓటీటీ బాటపడుతున్న విషయం తెలిసిందే.
ఈ ఇద్దరి సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు క్రేజీ హీరోలు కూడా ఓటీటీ బాట పట్టబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగన్, మనోజ్ బాజ్‌పాయ్, గుల్షన్ దేవయ్య వంటి వారు ఓటీటీల్లో సినిమాలు, సిరీస్‌లు చేస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం ఆ సంస్కృతి ఇంకా ప్రారంభం కాలేదు. కానీ రానున్న రోజుల్లో అది మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇంత వరకు చిన్న హీరోల వెంటే పడిన ఓటీటీలు ఇప్పుడు టైర్ 2 హీరోల వెంటపడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్న హీరో మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్‌లో `ఇరుముడి` చేస్తున్న రవితేజతో ఓ క్రేజీ వెబ్ సిరీస్‌ని నిర్మించాలని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే తనతో చర్చలు ప్రారంభించారని, త్వరలోనే చర్చలు ఫైనల్ అయి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.
ఇక ఇప్పటికే విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో `ధూత` పేరుతో వెబ్ సిరీస్ చేసిన నాగచైతన్య త్వరలో దీనికి సంబంధించిన నెక్స్ట్ సీజన్ ని స్టార్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. వరుస బ్లాక్ బస్టర్లతో యంగ్ హీరోల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న అడివి శేష్ కూడా ఓటీటీ బాట పడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తనతో నెట్‌ఫ్లిక్స్ వర్గాలు చర్చలు జరుపుతున్నారట. ఇక కిరణ్ అబ్బవరం కూడా రెడీ అవుతున్నాడట. డియర్ కాంమ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఓ వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో తిరువీర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని ఇన్ సైడ్ టాక్.