'ఛాంపియన్'.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

బాక్సాఫీస్ నంబర్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు 'ఛాంపియన్' దాదాపు 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.;

Update: 2025-12-26 06:47 GMT

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా లాంటి క్రేజీ బ్యానర్స్ నుంచి వచ్చిన సినిమా కావడంతో 'ఛాంపియన్' పై ఆడియెన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రోషన్ మేక హీరోగా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు నిన్న థియేటర్లలోకి వచ్చింది. అయితే మార్నింగ్ షో నుంచే సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ప్రీ రిలీజ్ బజ్ స్ట్రాంగ్ గా ఉన్నా, సినిమా మీద ఉన్న భారీ అంచనాల వల్ల ఫైనల్ అవుట్ పుట్ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మరికొందరు అంటున్నారు.

 

రివ్యూలు, మౌత్ టాక్ కాస్త అటూ ఇటూగా ఉన్నప్పటికీ, సినిమా ఓపెనింగ్స్ మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించడంలో చిత్ర బృందం సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా మేకర్స్ చేసిన అగ్రెసివ్ ప్రమోషన్స్, మ్యూజిక్ ఆల్బమ్ హిట్ అవ్వడం సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ గా మారింది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ విషయంలో సినిమా వెనక్కి తగ్గలేదు.

బాక్సాఫీస్ నంబర్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు 'ఛాంపియన్' దాదాపు 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. రోషన్ కి ఇది రెండో సినిమానే. ఒక అప్ కమింగ్ హీరో సినిమాకి డే 1 ఈ రేంజ్ ఫిగర్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయంటే అది కచ్చితంగా సినిమాకి ఉన్న క్రేజ్ ని చూపిస్తోంది. అమెరికాలో కూడా సినిమాకు డీసెంట్ రెస్పాన్స్ అందుతోంది. ఇప్పటికే లెక్క 75K డాలర్స్ కు చేరినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సుమారు 20 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే 4.5 కోట్లు వచ్చాయంటే, నిర్మాతలు చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నట్లే లెక్క. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, వీకెండ్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చాలా దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉంది. కొన్ని ఏరియాల్లో సినిమా హోల్డ్ బాగుందని రిపోర్ట్స్ వస్తున్నాయి.

సినిమాలో రోషన్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. కీలక సన్నివేశాల్లో సినిమాని తన భుజాల మీద లాక్కొచ్చాడని అంటున్నారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. పాటలు ముఖ్యంగా మాస్ సెంటర్లలో ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గా ఉండటం ప్లస్ అయ్యింది.

ఓవరాల్ గా చూస్తే.. టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర 'ఛాంపియన్' పర్ఫార్మెన్స్ బాగుంది. రాబోయే రెండు రోజులు సినిమాకి చాలా కీలకం. కలెక్షన్స్ ఇలాగే స్టెడీగా ఉంటే, ఈజీగా గట్టెక్కేస్తుంది. టాక్ పక్కన పెడితే, కమర్షియల్ గా సినిమాకి మంచి రన్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News