ఆ కామెంట్‌పై రౌడీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారా?
తమిళ, మలయాళ డైరెక్టర్స్ ఈ మధ్య కెమెరా వెనక యాక్షన్, కట్ కు బ్రేక్ ఇచ్చి కెమెరా ముందుకు వచ్చేస్తున్నారు.;
తమిళ, మలయాళ డైరెక్టర్స్ ఈ మధ్య కెమెరా వెనక యాక్షన్, కట్ కు బ్రేక్ ఇచ్చి కెమెరా ముందుకు వచ్చేస్తున్నారు. హీరోలుగా వరుస సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌లు సాధిస్తున్నారు. ఇప్పుడు వీరి బాటలోనే పయనిస్తున్నాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. `పెళ్లి చూపులు` సినిమాతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు తరుణ్ భాస్కర్. మెగాఫోన్ పట్టి సినిమాలు చేస్తూనే మరో పక్క నటుడిగానూ తమిళ, మలయాళ డైరెక్టర్ల తరహాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. డైరెక్టర్‌గా ఆ మధ్య కొంత గ్యాప్ ఇచ్చినా హీరోగా మాత్రం తెరపై వరుస సినిమాలు చేస్తున్నాడు.
`మహానటి`, సమ్మోహనం, ఫలక్‌నుమాదాస్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించినా `మీకు మాత్రమే చెప్తా` సినిమాతో మెయిన్ లీడ్‌లోకి వచ్చేశాడు. కొన్నేళ్ల విరామం తరువాత తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మూవీ `ఓం శాంతి శాంతి శాంతిః`. మలయాళంలో యంగ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ నటించిన హిట్ ఫిల్మ్ `జయ జయ జయ జయహే` ఆధారంగా దీన్ని తెలుగులో రీమేక్ చేశారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.
ఇది ఓటీటీల్లోకి రాకముందే తరుణ్ భాస్కర్ మరో కామెడీ ఎంటర్‌టైనర్‌ని రెడీ చేస్తున్నాడు. తను నటిస్తున్న లేటెస్ట్ సెటైరికల్ కామెడీ ఎంటర్‌టైనర్ `గాయపడ్డ సింహాం`. ఈ మూవీ ద్వారా కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 9న ఈ మూవీ టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫిరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ఆకట్టుకుంటోంది. అమెరికా వెళ్లాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యే యువకుడి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
టీజర్ నిండా హీరో క్యారెక్టర్‌పై పంచ్‌లు భారీగానే ఉన్నాయి. ప్రేక్షకుల్ని ఆద్యంత నవ్వించేలానే ఉన్నాయి కానీ టీజర్ చివర్లో `పెళ్ళిచూపులు` ఐకానిక్ సీన్‌ని తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లాపై రీక్రియేట్ చేశారు. `పుళ్లి చూపులు` మీద మీ ఒపీనియన్ ఏంటీ అని ఫరియా అడిగితే..యావరేజ్ సినిమా ఓవర్ హైప్ అయిపోయింది అంతే` అంటే తరుణ్ భాస్కర్ బదులివ్వడం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. `పెళ్లి చూపులు` సినిమా దర్శకుడిగా తరుణ్ భాస్కర్‌కు, హీరోగా విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చింది.
అలాంటి సినిమాని యావరేజ్ అని డీగ్రేడ్ చేయడం, జాతీయ స్థాయిలో అవార్డుల్ని దక్కించుకున్న సినిమాపై డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కరే సెటైర్లు వేయడం రౌడీ ఫ్యాన్స్‌ని కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. మరి తరుణ్ భాస్కర్ `యావరేజ్`కామెంట్స్‌పై రౌడీ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారా? .. అన్నది తరుణ్ భాస్కరే కదా అని లైట్ తీసుకుంటారా? అనే చర్చ నెట్టింట జరుగుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది.