ఎప్పుడూ చేయ‌నిది చేస్తే అలాగే ఉంటుంది!

షూటింగ్ ప్యాకప్ తర్వాత తిలోత్తమ ఇంటికి బయలుదేరుతుండగా అక్షయ్ ఖన్నా ఆమె వైపు నవ్వుతూ రావడం గమనించింది.

Update: 2026-06-30 11:30 GMT

ఒక్కొక్క‌రిది ఒక్కో నైజం. కొంద‌రు సెట్ లో స‌ర‌దాగా చ‌లాకీగా ఉంటే? మ‌రికొంత మంది సీరియ‌స్ గా రిజ‌ర్వ్ గా ఉండటానికి ఇష్ట‌ప‌డ‌తారు. తాజాగా ఇలాంటి స‌న్నివేశ‌మే ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `ఇక్క` త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో న‌టించిన‌ తిలోత్తమ షోమ్- సహనటుడు అక్షయ్ ఖన్నాను సెట్స్‌లో చూసినప్పుడు వెంటనే గుర్తుపట్టలేకపోయానని తెలిపింది. సాధారణంగా అక్షయ్ ఖన్నా తెరపై గానీ, బయట గానీ ఎక్కువగా నవ్వుతూ కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణమని తిలోత్త‌మ తెలిపారు.

షూటింగ్ ప్యాకప్ తర్వాత తిలోత్తమ ఇంటికి బయలుదేరుతుండగా అక్షయ్ ఖన్నా ఆమె వైపు నవ్వుతూ రావడం గమనించింది. అప్పటికే ఆ వ్యక్తి ఎవరో తెలియక? ఏదో మర్యాదపూర్వకంగా తానూ నవ్వి ముందుకు వెళ్లిపోయింది. అయితే అక్షయ్ ఆమెను పేరు పెట్టి పిలవడంతో ఆగి వెనక్కి తిరిగి చూడగా అతను అక్షయ్ ఖన్నా అని తెలిసి ఆశ్చర్యపోయింది. అక్షయ్ ముఖంలో కనిపించిన ఆ అరుదైన చిరునవ్వు వల్లనే ఆమె అతడిని గుర్తించలే కపోయానని చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ప‌ల‌క‌రించ‌ని వ్య‌క్తి ఒక్క‌సారిగా తార‌స‌ప‌డి ప‌ల‌కరిస్తే? ఒక ర‌క‌మైన అనుభూతికి లోన‌వ‌వ్వ‌డం స‌హ‌జం.

ఆ ప‌ల‌కరింపుకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్దం కాని స‌న్నివేశం అక్క‌డ ఎదుర‌వుతుంది. అక్ష‌య్ ఖ‌న్నా పిలుపుతో తిలొత్త‌మ అలాంటి గంద‌ర‌గోళానికే గురైంది. ల‌క్కీగా స‌గం దూరం వెళ్లిన త‌ర్వాత పిల‌వ‌డంతో? ఆ దూరం నుంచి అక్క‌డ సంభాష‌ణ ముగిసింది. అదే ఎదురెదుగా ఉన్న స‌మ‌యంలో ప‌ల‌క‌రింపు జ‌రిగితే? మొహ మాటంతో మాట్లాడ‌టం మ‌రింత ఇబ్బందిగా ఉండేద‌ని చెప్పుకొచ్చింది. `ఇక్క` విష‌యాల్లోకి వెళ్తే.. సన్ని డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న `ఇక్క` చిత్రం మరోసారి కోర్టు రూమ్ డ్రామాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇందులో సన్ని దేయోల్ శక్తివంతమైన లాయర్‌గా కనిపిస్తుండగా, అతని గతానికి చెందిన వ్యక్తి పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఇద్ద‌రి మధ్య జరిగే న్యాయపోరాటం - సంఘర్షణ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలో తిలోత్తమ షోమ్ నిబద్ధత కలిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న‌టిస్తుంది. దియా మీర్జా కుటుంబ బాధ్యతలు నెరవేర్చే భార్య పాత్రలో కనిపిస్తారు. ఇంకా సంజీదా షేక్, శిశిర్ శర్మ , ఆకాంక్ష రంజన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అల్థియా కౌశల్ - మయాంక్ తివారీ కథను అందించారు.

Tags:    

Similar News