ఉపాస‌న డెలివ‌రీ కోసం రెండు టీమ్‌లు హై కేరింగ్

రామ్ చరణ్- ఉపాసన దంపతుల ఆనందోత్సాహంపై ప్రస్తుతం సోషల్ మీడియాల‌లో చాలా చ‌ర్చ సాగుతోంది.;

Update: 2026-02-09 17:41 GMT

రామ్ చరణ్- ఉపాసన దంపతుల ఆనందోత్సాహంపై ప్రస్తుతం సోషల్ మీడియాల‌లో చాలా చ‌ర్చ సాగుతోంది. దీనికి కార‌ణం ఉపాస‌న పండంటి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డ‌మే. ఒక‌రు పాపాయి.. ఒక‌రు అబ్బాయి. మ‌గ బిడ్డ‌ త‌ల్లి పోలిక అయితే, ఆడ బిడ్డ‌ తండ్రి పోలిక అని ఉపాస‌న స్వ‌యంగా చెప్పారు. అయితే అపోలో సంస్థానాధీశురాలైన‌ ఉపాస‌నకు డెలివ‌రీ స‌మ‌యంలో తీసుకున్న కేరింగ్ ఏ రేంజులో ఉందో తాజాగా విడుద‌లైన వీడియో చెబుతోంది. దీనికోసం గైన‌కాల‌జీ విభాగంతో అనుసంధాన‌మైన రెండు టీమ్‌ల‌ను ఏర్పాటు చేసి, ప‌దుల సంఖ్య‌లో డాక్ట‌ర్లు ఉపాసన కోసం ఎంత కేర్ తీసుకున్నారో అర్థ‌మ‌వుతోంది.

ఇప్పుడు అపోలో ఆసుపత్రి వైద్యులు ఉపాసన డెలివరీ, కవల పిల్లల గురించి మాట్లాడిన వీడియో ఒక‌టి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వైద్యులు వెల్లడించిన విష‌యాలు ఆస‌క్తిని క‌లిగించాయి. అపోలో ఆసుపత్రిలోని సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సువర్చల, ఉపాసన ఆరోగ్య స్థితి, ప్రసవం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉపాసన డెలివరీ కోసం అపోలో ఆసుపత్రిలో ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి మెడికల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కవల పిల్లల జననం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ, దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కూడా గ‌త ఇంట‌ర్వ్యూలో ఆమె చెప్పారు.

ఉపాసన స్వతహాగా హెల్త్ కేర్ రంగంలో ఉన్నందున, ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు అసాధార‌ణ‌మైన‌వి. ఆహారం, వ్యాయామం స‌హా ప్ర‌తి విష‌యంలో ఉపాస‌న ఎంతో జాగ్ర‌త్త తీసుకున్నారు. కీల‌క స‌మ‌యంలో ఉపాస‌న శ్ర‌ద్ధ‌, కృషిపైనా వైద్యులు ప్రశంసలు కురిపించారు.

అపోలో క్రిటికల్ కేర్ విభాగం నిపుణులు డాక్టర్ సుబ్బారెడ్డి కూడా ఈ ఏర్పాట్లపై మాట్లాడారు. మెగా వారసుల రాక కోసం ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రతతో పాటు, మదర్ అండ్ చైల్డ్ కేర్ కోసం ప్రత్యేకమైన విభాగాన్ని కేటాయించామని చెప్పారు. డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల టీమ్ అందుబాటులో ఉందని ఇత‌ర వైద్యులు తెలిపారు.

ఉపాసన ఇప్పటికే క్లిన్ కారా అనే కుమార్తెకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క‌వ‌ల‌ల జ‌న‌నంతో ఉపాస‌న‌- రామ్ చ‌ర‌ణ్ స‌హా అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. చ‌ర‌ణ్ క‌వ‌ల‌ల‌కు తండ్రి అయ్యాడు అని తెలియ‌గానే అభిమానులు దేవుళ్ల‌కు పూల‌దండ‌లు వేసి ప్రార్థ‌న‌లు చేసిన వీడియోలు ఇంత‌కుముందు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది అనే చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం అత‌డు చాలా హార్డ్ వ‌ర్క్ చేసారు.



Tags:    

Similar News