IIFA - 2026 అవార్డులలో దురంధర్-చావా హవా.. ఉత్తమ నటుడు ఎవరు?
ఈ రెండు చిత్రాలు వేర్వేరు జానర్లలో భారతీయ చలనచిత్ర స్థాయిని ఎంతగా పెంచాయో ఈ అవార్డుల ఫలితాలు నిరూపిస్తున్నాయి.
26వ ఐఐఎఫ్ఐ (IIFA) అవార్డ్స్ 2026 వేడుకల్లో ధురంధర్, ఛావా చిత్రాలు అపూర్వమైన అవార్డులను కొల్లగొట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒకవైపు స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన `ధురంధర్` పాపులర్ అండ్ మెజారిటీ కేటగిరీల్లో క్లీన్ స్వీప్ చేయగా... మరొకవైపు మరాఠా చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న `ఛావా` చిత్రం సాంకేతిక విభాగాలో మెరుపులు మెరిపించింది. ఈ రెండు చిత్రాలు వేర్వేరు జానర్లలో భారతీయ చలనచిత్ర స్థాయిని ఎంతగా పెంచాయో ఈ అవార్డుల ఫలితాలు నిరూపిస్తున్నాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ చిత్రం ఏకంగా 12 అవార్డులతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక పటిష్టమైన ఇంటెలిజెన్స్ స్పై డ్రామాకు అవసరమైన గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, దర్శకత్వ ప్రతిభకు గాను ఆదిత్య ధర్‌కు ఉత్తమ దర్శకుడు, స్క్రీన్‌ప్లే, ఒరిజినల్ స్టోరీ అవార్డులు దక్కాయి. నటన పరంగా కథానాయకుడిగా దేశభక్తి, యాక్షన్ కలగలిపిన పాత్రలో జీవించినందుకు రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడు అవార్డును అందుకోగా, నెగెటివ్ పాత్రలో ఉత్కంఠను రేకెత్తించిన అక్షయ్ ఖన్నా (ఉత్తమ ప్రతినాయకుడు), బలమైన క్యారెక్టర్ రోల్‌లో నటించిన సంజయ్ దత్ (ఉత్తమ సహాయ నటుడు) తమ నటనతో ఈ అవార్డులను కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా వికాష్ నౌలఖా విజువల్స్ (సినిమాటోగ్రఫీ), శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన హై-వోల్టేజ్ మ్యూజిక్ ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
మరొకవైపు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఛావా చిత్రం సాంకేతిక విభాగాలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. చారిత్రక ఘట్టాలు, భారీ యుద్ధ సన్నివేశాలకు తగినట్లుగా అంతర్జాతీయ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ అందించినందుకు అసెంబ్లేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ రెడిఫైన్‌లకు ఉత్తమ వీఎఫ్ఎక్స్ అవార్డు లభించింది. అదే విధంగా యుద్ధ ఘట్టాలు, శబ్దాలకు ప్రాణం పోస్తూ ప్రేక్షకులను థియేటర్‌లో లీనం చేసిన సాంకేతిక నైపుణ్యానికి గాను అలోక్ దే కు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డు దక్కింది.
సంగీత విభాగంలో ఛావా సాధించిన విజయం ఎంతో ప్రత్యేకమైనది. ఈ చారిత్రక గాథలోని ఆవేశాన్ని, భావోద్వేగాలను, మరాఠా పౌరుషాన్ని తన గంభీరమైన సంగీతంతో ప్రతిధ్వనించేలా చేసినందుకు స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కు ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవార్డు వరించింది. మొత్తానికి కంటెంట్- నటన పరంగా ధురంధర్ ప్రేక్షకులను అలరిస్తే... సాంకేతిక ప్రతిభ - సంగీత వైభవంతో ఛావా ప్రేక్షకులను మైమరిపించి ఐఐఎఫ్ఏ 2026 వేదికపై ఈ రెండూ భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పాయి.
ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2026లో `ధురంధర్` మొత్తం 12 విభాగాలో విజయ దుందుభి మోగించి క్లీన్ స్వీప్ చేసింది.
12 అవార్డుల వివరాల పూర్తి జాబితా:
1. ప్రధాన విభాగాలు - 7 అవార్డులు
2. ఉత్తమ చిత్రం : జ్యోతి దేశ్‌పాండే, ఆదిత్య ధార్, లోకేష్ ధార్
3. ఉత్తమ దర్శకుడు - ఆదిత్య ధార్
4. ఉత్తమ నటుడు : రణ్‌వీర్ సింగ్
5. ఉత్తమ సహాయ నటుడు : సంజయ్ దత్
6. ఉత్తమ ప్రతినాయకుడు : అక్షయ్ ఖన్నా
7. ఉత్తమ సంగీత దర్శకత్వం : శాశ్వత్ సచ్‌దేవ్
8. ఉత్తమ కథ : ఆదిత్య ధార్
2. సాంకేతిక విభాగాలు - 5 అవార్డులు
8. ఉత్తమ స్క్రీన్‌ప్లే : ఆదిత్య ధార్
9. ఉత్తమ సంభాషణలు : ఆదిత్య ధార్
10. ఉత్తమ ఛాయాగ్రహణం : వికాష్ నౌలఖా
11. ఉత్తమ ఎడిటింగ్ : శివకుమార్ వి. పనిక్కర్
12. ఉత్తమ సౌండ్ డిజైన్ : బిశ్వదీప్ ఛటర్జీ