టాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులకు మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న‌ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

Update: 2026-10-31 04:43 GMT

పాన్-ఇండియా ప్రాజెక్టుల స్థాయి ఇప్పుడు ప్రాంతీయ మార్కెట్‌కే పరిమితం కాలేదు. గ్లోబల్ రేంజ్‌కు విస్తరించింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ ఐకాన్స్ తదుపరి చిత్రాలను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. కథలు, దర్శకులు, బడ్జెట్ అన్నీ కుదిరి ప్రాజెక్టులు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నా? ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్టులకు సరైన హీరోయిన్లను ఎంపిక చేయడం ఆయా స్టార్ డైరెక్టర్లకు అతిపెద్ద సవాలుగా మారింది. హీరోల పాన్-ఇండియా ఇమేజ్‌కు సరితూగే కథానాయికలను వెతకడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెర‌కెక్క‌నున్న‌ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. `రంగస్థలం` లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇద్ద‌రి కాంబో రిపీట్ అవుతుండటంతో ఇందులో కథానాయిక పాత్ర కీలకమైనదిగా మారింది. గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా సుకుమార్ మార్క్ ఇంటెన్స్ యాక్టింగ్‌ను పండించగల నటి కావాలి. అటు నార్త్ మార్కెట్.. ఇటు సౌత్ మార్కెట్‌ను ఆకట్టుకునేలా ఉన్న అగ్ర కథానాయికల కోసం సుకుమార్ టీమ్ అన్వేషిస్తోంది.

మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ కూడా కాస్టింగ్ పరంగా పెద్ద సవాలునే ఎదుర్కొంటోంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ డెలివరీ, బలమైన ఎమోషన్లకు సరిపోయే నటిని ఎంచుకోవడం ముఖ్యం. ఎన్టీఆర్ పాన్-ఇండియా క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని చిత్రంలో నటించే హీరోయిన్ బాలీవుడ్ ..పాన్-ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ అయ్యుండాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సరైన ఆప్షన్ కోసం కసరత్తు చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ విషయంలోనూ హీరోయిన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. లోకేష్ కనగరాజ్ పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమాలో కథానాయిక పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అల్లు అర్జున్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా విలక్షణమైన పర్‌ఫార్మెన్స్ ఇచ్చే నటిని ఎంపిక చేయడంలో లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఈ ముగ్గురు స్టార్ హీరోలకు హీరోయిన్లను ఫైనల్ చేయడం అంత సులభమైన విష‌యం కాదు. ఒక్కో ప్రాజెక్ట్ బడ్జెట్ వందల కోట్లలో ఉంటుంది. నార్త్ ఇండియా బెల్ట్‌లో కూడా బిజినెస్ రీచ్‌ను పెంచాల్సి ఉంటుంది. దీంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు లేదా సౌత్‌లో మంచి డిమాండ్ ఉన్న పాన్-ఇండియా హీరోయిన్ల కాల్ షీట్లు దొరకడం, డేట్స్ అడ్జస్ట్ కావడం స‌వాల్తో కూడిన వ్య‌వ‌హ‌రామే. అలాగే హీరోల స్క్రీన్ ప్రెజెన్స్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉండే పెయిర్‌ను సెట్ చేయడం కత్తిమీద సామే.

Tags:    

Similar News