SRK మన్నత్ కొనకముందే అక్కడ బిగ్ షాట్!

బాద్‌షా షారుఖ్ ఖాన్ అడ్రస్‌గా మారిపోయిన ప్రసిద్ధ బంగ్లా `మన్నత్` గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు.

Update: 2026-10-31 01:30 GMT

బాద్‌షా షారుఖ్ ఖాన్ అడ్రస్‌గా మారిపోయిన ప్రసిద్ధ బంగ్లా `మన్నత్` గురించి తెలియని సినీ ప్రియులు ఉండరు. కోట్లాది మంది అభిమానులకు ఓ చారిత్రక ప్రదేశం లాంటి ఈ విలాసవంతమైన భవనాన్ని షారూఖ్ ఖాన్ స్వంతం చేసుకునే ముందే అక్కడ ఓ ప్రముఖ సినిమా షూటింగ్ జరిగిందనే విషయం తాజాగా బయటపడింది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఓ రియాలిటీ షోలో తాను నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా `తేజాబ్` షూటింగ్ మన్నత్ భవనంలోనే జరిగిందని వెల్లడించి ఆశ్చర్యపరిచారు.

`ఇండియా కే టాప్ 1%` కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కపూర్ షో సందర్భంగా పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ క్రమంలో షారూఖ్ ఖాన్ తొలి రోజులను.. ముంబైకి వచ్చిన కొత్తలో ఆయన పడిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. షారూఖ్ ఖాన్ బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ముందే తనను కలవడానికి వచ్చారని.. ఆయన కళ్లలో ఉన్న కసిని చూసి భవిష్యత్తులో ఆయనొక పెద్ద స్టార్ అవుతానని ముందే ఊహించానని అనిల్ కపూర్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

షారూఖ్ ఖాన్ ముంబైలో అడుగుపెట్టిన తొలినాళ్లలో కార్టర్ రోడ్డులోని ఒక చిన్న ఫ్లాట్‌లో నివసించేవారని అనిల్ కపూర్ తెలిపారు. అప్పట్లో ఒక రోజు తాను సముద్రతీరాన ఉన్న అందమైన బంగ్లాలో కెరీర్‌ను మలుపు తిప్పిన `తేజాబ్` సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసినట్లు అనీల్ గుర్తుచేసుకున్నారు. కాలక్రమేణా షారూఖ్ ఖాన్ కష్టంతో అదే భవనాన్ని సొంతం చేసుకుని తన కలల సామ్రాజ్యంగా మార్చుకోవడం నిజంగా అద్భుతమైన ప్రయాణమని ప్రశంసించారు.

ఇద్దరు ప్రముఖ నటుల మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహబంధం ఉంది. 1995లో విడుదలైన `త్రిమూర్తి` చిత్రంలో షారూఖ్ ఖాన్, అనిల్ కపూర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా? ఇద్ద‌రి కాంబినేషన్ మాత్రం ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్ద‌రి మధ్య అనుబంధం అలా కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం షారూఖ్ ఖాన్ `కింగ్` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో షారుక్ తో పాటు కుమార్తె సుహానా ఖాన్ కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం షారూఖ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అనిల్ కపూర్ కూడా విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

మొత్తానికి షారూఖ్ ఖాన్ కలల బంగ్లాగా మార్చుకున్న `మన్నత్` భవనంలో దశాబ్దాల క్రితమే అనిల్ కపూర్ తన సినిమా షూటింగ్ జరుపుకోవడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు షూటింగ్ లొకేషన్‌గా ఉన్న ఆ ప్రాపర్టీ నేడు గ్లోబల్ స్టార్‌కు నిలయంగా మారడం వెనుక ఉన్న ప్రయాణం సినీ ప్రియుల్ని ఆలోచ‌న‌లో ప‌డేసింది.

Tags:    

Similar News