అద్దాల మేడను తలపించే ఫహాద్-నజ్రియా కొచ్చి డ్రీమ్ హోమ్!
ఈ ఇంటి ప్రత్యేకత ఏంటంటే? నటుడు దుల్కర్ సల్మాన్ సతీమణి- ఇంటీరియర్ డిజైనర్ అయిన అమల్ సుఫియా స్వయంగా ఇంటిని డిజైన్ చేయడం విశేషం.
మలయాళ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్ ఫహాద్ ఫాజిల్- నజ్రియా నాజిమ్ జోడీకి ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఆన్-స్క్రీన్ మ్యాజిక్‌తోనే కాకుండా వ్యక్తిగత జీవితంతోనూ నిత్యం ట్రెండింగ్‌లో ఉండే కపుల్ కొచ్చిలో నివసించే డ్రీమ్ హోమ్‌కు సంబంధించిన కొన్ని అందమైన విశేషాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సహజత్వానికి పెద్దపీట వేస్తూ వింటేజ్ లుక్‌తో అత్యంత ప్రశాంతంగా తీర్చిదిద్దిన ఇంటి ఇంటీరియర్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ ఇంటి ప్రత్యేకత ఏంటంటే? నటుడు దుల్కర్ సల్మాన్ సతీమణి- ఇంటీరియర్ డిజైనర్ అయిన అమల్ సుఫియా స్వయంగా ఇంటిని డిజైన్ చేయడం విశేషం. ఫహాద్, నజ్రియా ఇష్టాలకు తగినట్లుగా ఇంటిని ఎంతో హృద్యంగా తీర్చిదిద్దారు. ఇంటి లోపలికి అడుగుపెట్టగానే కనిపించే బ్రైట్ లివింగ్ రూమ్.. విశాలమైన సోఫాలు.. సాఫ్ట్ కుషన్లు ఇంటర్‌నెట్ వేదికగా ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. పెద్ద పెద్ద కిటికీల గుండా ఇంట్లోకి వచ్చే సహజమైన కాంతి ఇంటికి మరింత అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
ఇంటికి సంబంధించిన మరో ప్రధాన ఆకర్షణ బాల్కనీ డిజైన్. సాధారణంగా లగ్జరీ అపార్ట్‌మెంట్లలో ఉండే బాల్క నీలకు భిన్నంగా.. ఇక్కడ పచ్చని మొక్కలతో కూడిన ప్రకృతి వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. గోడలకు వేసిన సాఫ్ట్ రంగులతో పాటు బ్రిక్ యాసెంట్స్ ఈ ప్రాంతానికి ఒక రకమైన క్లాసిక్ లుక్‌ను అందిస్తున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన వైట్ స్వింగ్ ఛైర్ ఈ జంట రిలాక్స్ అయ్యేందుకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా నిలుస్తోందని చెప్పొచ్చు.
వింటేజ్ డిజైన్ టచ్‌లు.. రంగురంగుల డెకరేటివ్ పీస్‌లతో ఇల్లు ఆర్ట్ గ్యాలరీని తలపిస్తుంది. అతిగా హంగు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ప్రతి మూలను ఎంతో శ్రద్ధగా డిజైన్ చేసుకున్నారు. ఫెస్టివల్స్ ...ప్రత్యేక సందర్భాల్లో నజ్రియా సోషల్ మీడియాలో పంచుకునే ఫోటోల ద్వారా ఇంటర్‌వెటర్స్ అందం బయట ప్రపంచానికి పరిచయం అవుతుంటుంది.
సినిమాలతో బిజీగా ఉండే స్టార్ కపుల్ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొచ్చి ఇల్లే సరైన వేదికగా ఎంచుకున్నారు. నటనతోనే కాకుండా తమ జీవనశైలితోనూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఫహాద్, నజ్రియా జోడీకి సంబంధించిన హోమ్ టూర్ విశేషాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.