44 వ‌య‌సు అంటే న‌మ్మేదెలా శ్రీ‌యా?

తాజాగా శ్రియా శరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన‌ కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Update: 2026-10-31 08:02 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలామంది కథానాయికలు విదేశీ మోడల్స్ లేదా విదేశీ క్రీడాకారులను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అందులో కొన్ని బంధాలు ఆశించిన స్థాయిలో కొనసాగక ముగిసిపోవడం చూశాం. కానీ దానికి భిన్నంగా సీనియర్ కథానాయిక శ్రియా శరణ్ ఒక విదేశీ క్రీడాకారుడిని వివాహం చేసుకుని ఎంతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. పెళ్లయి ఒక పాపకు తల్లి అయినా వ్యక్తిగత బాధ్యతలను నెరవేరుస్తూనే తన గ్లామర్ అండ్ యాక్టింగ్ కెరీర్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.

 

తాజాగా శ్రియా శరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన‌ కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోషూట్‌లో శ్రియ తన బిగి అందాలను ప్రదర్శిస్తూ అభిమానుల్లో హుషారు పెంచారు. ప్రత్యేకమైన డిజైనర్ శారీకి తగ్గట్టుగానే క్రిస్టల్స్.. గోల్డెన్ జరీ లుక్‌తో మెరిసిపోతున్న ఆ బ్లౌజ్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పెళ్లై పిల్లలు ఉన్నా శ్రియలో చెక్కుచెదరని రూపాన్ని, ఫిట్‌నెస్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు శ్రీ‌య అందానికి ఫిదా అయిపోయిన అభిమానులు అప్పుడే 44 వ‌య‌సు అంటే న‌మ్మేదెలా? అంటూ కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం ఇష్టం సినిమాతో తెలుగు తెర‌పై అడుగుపెట్టిన శ్రీ‌య ఇప్ప‌టికీ త‌న అందాన్ని అంతే క్లాసీగా మెయింటెయిన్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

ఈ ప్రత్యేకమైన ఈవెంట్ లుక్ వెనుక పెద్ద ఫ్యాషన్ టీమ్ శ్రమ ఉందనే చెప్పాలి. ఐటిఆర్ హెచ్ రిధి బన్సాల్ బ్రాండ్‌కు చెందిన దుస్తులను ప్రముఖ స్టైలిస్ట్ మోహిత్ రాయ్, నన్నికా భూప్తాని ఎంతో ఆకర్షణీయంగా స్టైలింగ్ చేశారు. దీనికి జకార్తీ జ్యువెలరీ అందించిన ఆభరణాలు మరింత శోభను తెచ్చాయి. ఈ అద్భుతమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ తనకు సహకరించిన స్టైలింగ్ అండ్ మేకప్ టీమ్‌కు శ్రియ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

 

కేవలం గ్లామరస్ ఫోటోషూట్‌లకే పరిమితం కాకుండా. పెళ్లి తర్వాత కూడా శ్రియ వరుస సినిమాలతో రీ-ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవల తేజ సజ్జా కథానాయకుడిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన సోషియో-ఫాంటసీ మూవీ `మిరాయ్`లో శ్రియ అంబికా ప్రజాపతిగా కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో వచ్చిన ఈ పాన్-ఇండియా చిత్రం థియేటర్లలో ఘనవిజయం సాధించింది. అలాగే బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సరసన నందిని సల్గాఓంకర్ గా నటించిన హిట్ ఫ్రాంచైజ్ `దృశ్యం 3` ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది.

తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్-సూర్య కాంబినేషన్ మూవీ `రెట్రో` లో లవ్ డిటాక్స్ స్పెషల్ సాంగ్‌తో అలరించిన శ్రియ, కార్తిక్ నరేన్ దర్శకత్వంలో అరవింద్ స్వామితో కలసి `నరగాసూరన్` అనే చిత్రంలోనూ నటించారు. వీటితో పాటు డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో కరణ్ జోహార్ నిర్మించిన `షోటైమ్` వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెట్టి ఓటీటీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా విభిన్నమైన పాత్రలు, భారీ సోషియో-ఫాంటసీ ప్రాజెక్ట్‌లు - డిజిటల్ సిరీస్‌లతో శ్రియా శరణ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అత్యంత బిజీ నటిగా దూసుకుపోతున్నారు.

Tags:    

Similar News