నాగ చైతన్య కోసం సితార పెద్ద సెటప్..!

ఐతే సితార బ్యానర్ లో ఈసారి నాగ చైతన్య చేసే సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. పెద్ద సెటప్ అంటూ నాగ వంశీ చెప్పారు కాబట్టి కచ్చితంగా ఒక క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసే ప్లానింగ్ ఉందని అర్ధమవుతుంది.;

Update: 2025-12-26 07:33 GMT

సితార ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ లో ప్రస్తుతం స్మాల్, మీడియం నుంచి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థ. సూర్యదేవర నాగ వంశీ ఈ బ్యానర్ లో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఐతే ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా వచ్చింది శైలజా రెడ్డి అల్లుడు. నాగ చైతన్య తోనే ఈ బ్యానర్ మొదలైంది. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. 2018లో నాగ చైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు చేసిన సితార నాగ వంశీ ఈ ఏడేళ్లలో ఎన్నో సినిమాలు చేశారు.

నాగ చైతన్య 25వ సినిమా కోసం..

ఐతే మళ్లీ నాగ చైతన్యతో చేసే అవకాశం రాలేదు. నాగ చైతన్య కూడా తనతో బ్యానర్ మొదలు పెట్టి మరో సినిమా చేయట్లేదని నాగ వంశీని అడుగుతున్నాడట. ఐతే ఆ విషయాన్నే రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు నాగ వంశీ. నాగ చైతన్య కోసం ఒక భారీ ప్లాన్ ఉందని అంటున్నారు నాగ వంశీ. నాగ చైతన్య 25వ సినిమా కోసం పెద్ద సెటప్ రెడీ చేస్తున్నామని అన్నారు.

కుదిరితే 25వ సినిమా లేదంటే ఎప్పుడైనా సరే నాగ చైతన్యతో సినిమా మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు నాగ వంశీ. ఎందుకంటే తమ తొలి సినిమా హీరో కాబట్టి కచ్చితంగా అతని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాగ చైతన్య కూడా తండేల్ తర్వాత కెరీర్ మీద మరింత ఫోకస్ తో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ దండుతో సినిమా చేస్తున్న చైతన్య నెక్స్ట్ సితార తో దాదాపు కన్ ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది.

క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసే ప్లానింగ్..

ఐతే సితార బ్యానర్ లో ఈసారి నాగ చైతన్య చేసే సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. పెద్ద సెటప్ అంటూ నాగ వంశీ చెప్పారు కాబట్టి కచ్చితంగా ఒక క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసే ప్లానింగ్ ఉందని అర్ధమవుతుంది. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో సితార, అన్నపూర్ణ బ్యానర్లు కలిపి లెనిన్ సినిమా చేస్తున్నారు.

నాగ చైతన్య సినిమా గురించి నాగ వంశీ చేసిన ఈ కామెంట్స్ అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. ఆల్రెడీ తనకు ఎలాంటి కథలు సెట్ అవుతాయో అవే చేస్తున్నాడు నాగ చైతన్య. లవర్ బోయ్ ఇమేజ్ తో డిఫరెంట్ సినిమాలు చేస్తున్న నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్ లో వస్తున్న సినిమాతో థ్రిల్లర్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత తన మైల్ స్టోన్ మూవీ 25వ ప్రాజెక్ట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి అది ఏ కాంబినేషన్ లో వస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News