ప్రమోషనల్ ఈవెంట్స్ ఇలా మారాయేంటి?

కొన్ని రోజుల క్రితం దండోరా సినిమా ఈవెంట్‌ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి.;

Update: 2026-02-13 08:54 GMT

టాలీవుడ్‌ లో మూవీల ఆడియో లాంచ్‌ లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఒకప్పుడు కంప్లీట్ కు కేవలం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ గా ఉండేవి. హీరో హీరోయిన్ల ముచ్చట్లు, ట్రైలర్ రిలీజ్, ఫ్యాన్స్ సందడి.. ఇవే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేవి. కానీ కొంతకాలంగా ప్రమోషనల్ ప్రోగ్రామ్స్.. సినిమాల కన్నా ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యల కే సెంటర్స్ గా మారుతున్నాయి. దానిపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.

రీసెంట్ గా హే భగవాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో నటుడు నరేష్ చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. వాలెంటైన్స్ వీక్‌ లోని కిస్ డే ప్రస్తావనను తీసుకొచ్చిన ఆయన.. భారతీయ సంస్కృతి ప్రకారం పురుషులు మహిళలు హగ్ చేసుకోకూడదని అన్నారు. తాను హీరోయిన్స్ కు హగ్ చేసుకుందామని అనుకున్నానని, అందుకే వెనక్కి తగ్గానని చెప్పారు.

కిస్ డే బదులు హగ్ డే రోజు ఈవెంట్ చేయడం పనికొచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్ ని కొందరు కామెడీగా తీసుకోగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. అంతకుముందు ఇటీవల బరాబర్ ప్రేమిస్తా మూవీ ఈవెంట్ లో యంగ్ హీరో చంద్రహాస్ బూతు పాట పాడడం చర్చనీయాంశమైంది. దానిపై అనేక మంది ఫైర్ అయ్యారు. అలాంటి పాట పాడడం అసలు కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.

కొన్ని రోజుల క్రితం దండోరా సినిమా ఈవెంట్‌ లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. ఆయన మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పలువురు ఆయనకు మద్దతు తెలపగా.. మరికొందరు విమర్శించారు. నెట్టింట కొన్ని రోజుల పాటు ఎక్కడ చూసినా శివాజీ కామెంట్స్ పై పోస్టులే కనిపించాయని చెప్పాలి.

ఏదేమైనా సినిమా ఈవెంట్లు అసలు ఉద్దేశం ప్రేక్షకులకు ఆ మూవీ గురించి సమాచారం ఇవ్వడం, కంటెంట్‌ పై ఆసక్తి పెంచడం. కానీ ఇప్పుడు కొందరు పర్సనల్ ఫీలింగ్స్, కల్చర్ పేరుతో చేసే కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి. దీని వల్ల సినిమా అసలు విషయం పక్కకు వెళ్లిపోతుందని అనేక మంది అంటున్నారు. మరోవైపు, కొందరు మాత్రం ఇది కూడా ఒక రకమైన ప్రమోషన్ స్ట్రాటజీ కావచ్చని చెబుతున్నారు.

చిన్న సినిమాలకు ప్రమోషన్స్ కోసం ఇలాంటి వివాదాలు కావాలనే సృష్టిస్తున్నారనే అనుమానిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న కామెంట్ అయినా వెంటనే వైరల్ అవుతుండటంతో, కావాలనే అలా చేస్తున్నట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టాలీవుడ్‌ లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇప్పుడు సినిమాల కంటే వివాదాలకు సెంటర్స్ గా మారుతున్నాయనే పరిస్థితి ఆందోళన కలిగిస్తోందనే చెప్పాలి. ఇకపై అయినా సరిగ్గా ఈవెంట్స్ ను యూజ్ చేసుకోవాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News