అట్లీ - బన్నీ..అంత మంది రైటర్స్‌ని వాడారా?
`పుష్ప 2` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అంతకు మించిన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.;
`పుష్ప 2` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అంతకు మించిన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కోలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నెగెటివ్ ఛాయలున్న క్యారెక్టర్‌లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఇందులో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ టీమ్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమాల తరహాలో దీన్ని సరికొత్త ఇండియన్ సూపర్ హీరో స్టోరీగా దర్శకుడు అట్లీ రూపొందిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్‌తో సాగే క్యారెక్టర్‌లో సూపర్ హీరోగా బన్నీ ఇందులో కనిపించనున్నాడని ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన దగ్గరి నుంచి వినిపిస్తోంది. దీపికా పదుకోన్ కూడా శక్తివంతమైన యోధురాలి పాత్రని పోషిస్తోంది.
తన లుక్, గెటప్ కూడా సరికొత్తగా ఉంటుందట. హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు, రోమాంచితంగా సాగే యాక్షన్ ఘట్టాలు, గ్రాండ్ విజువల్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే టీమ్ ప్రకటించింది. అంతే కాకుండా మన సంస్కృతికి అద్దంపట్టే కథతో గ్లోబల్ ప్రేక్షకుల్నికూడా మెప్పించేలా రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు ఇది మర్చిపోలేని సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని దర్శకుడు అట్లీ హామీ ఇవ్వడంతో ఈ మూవీపై సహజంగానే అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
సమాంతర ప్రపంచం, పునర్జన్మల కథగా దీన్ని భారీ కాన్వాస్‌లో రూపొందిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రమ్యకృష్ణ, జిమ్ సర్భ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ కోసం తెలుగు రైటర్స్ వర్క్ చేసినట్టుగా తెలిసింది. దీన్నొక ఎయోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న అట్లీ కామెడీ సన్నివేశాలకు, భావోద్వేగ సీన్స్‌కు ప్రముఖ్యత నిస్తున్నాడట. అందులో భాగంగానే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శ్రీను వైట్ల టీమ్ సభ్యులతో పాటు ఇతర క్రేజీ రైటర్స్ చేత కామెడీ సీన్స్, డైలాగ్స్ రాయించుకున్నాడని, వీటిని బన్నీ, యోగిబాబుపై షూట్ చేస్తున్నాడని, సినిమాకు ఇవి హైలైట్‌గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్.
ఇప్పటి వరకు `#AA22xA6` అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ కోసం ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ని త్వరలో మేకర్స్ ప్రకటించబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8. ఇదే రోజు మూవీ టీజర్‌తో పాటు టైటిల్‌ని కూడా టీమ్ అనౌన్స్ చేయబోతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలోని వీఎఫ్ ఎక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైటైల్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ పాన్ వరల్డ్ మూవీని ఈ ఏడాది డిసెంబర్‌లో కానీ వచ్చే ఏడాది ప్రారంభంలోకానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.