మెగాస్టార్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. వారసులతో ఇలా..

మెగా వారసుడికి ‘శివరామ్ కొణిదెల’ అని, వారసురాలికి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేసినట్లు మెగాస్టార్ ప్రకటించారు.;

Update: 2026-02-13 08:53 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల పేర్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా మనవడు, మనవరాలి పేర్లను ప్రకటిస్తూ ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో చిరంజీవి దంపతులు, ఉపాసన తల్లిదండ్రులతో కలిసి ఉన్న పసిపాపల పక్కన నిలబడి ఉన్న దృశ్యం మెగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

 

కేవలం పేర్లు మాత్రమే కాదు, ఆ పేర్ల వెనుక ఉన్న ఎమోషన్‌ను కూడా చిరంజీవి తన పోస్ట్‌లో వివరించారు. సాధారణంగా నామకరణ వేడుకలు సైలెంట్ గానే జరుగుతుంటాయి. కానీ మెగాస్టార్ తన ఆనందాన్ని ఫ్యాన్స్‌తో పంచుకోవాలని భావించారు. ఈ చిన్నారుల జీవిత ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ అందరి ఆశీస్సులు కావాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

మెగా వారసుడికి ‘శివరామ్ కొణిదెల’ అని, వారసురాలికి ‘అన్వీరా దేవి కొణిదెల’ అని నామకరణం చేసినట్లు మెగాస్టార్ ప్రకటించారు. బాబు పేరు ‘శివరామ్’ వినగానే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఎందుకంటే చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ లోని ‘శివ’, రామ్ చరణ్ పేరులోని ‘రామ్’ కలిపి ఈ పేరు పెట్టారు. తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చరణ్ ఇలా కొడుకు పేరులో చాటుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక మెగా ప్రిన్సెస్ పేరు ‘అన్వీరా దేవి’ వెనుక కూడా గట్టి రీజనే ఉంది. అపరిమితమైన ధైర్యం, దైవిక శక్తి కలిసిన పేరు ఇదని చిరంజీవి వివరించారు. మన సంప్రదాయంలో స్త్రీ శక్తికి ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబించేలా ‘దేవి’ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే చేర్చినట్లు చరణ్ దంపతులు తెలిపారు. గ్రేస్, పవర్ రెండూ ఒకే దగ్గర ఉండాలన్నదే వారి ఆకాంక్ష అని ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ వచ్చింది. చిరంజీవి షేర్ చేసిన ఆ ఫోటోలో ఫ్యామిలీ బాండింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో పెద్దల సమక్షంలో పిల్లలకు ఈ పేర్లు పెట్టారు.

ముఖ్యంగా మొదటి కుమార్తె క్లిన్ కార రామ్ చరణ్ ఒడిలోనే కూర్చిని ఉంది. అయితే ఆమె ఫేస్ కనిపించకుండా బ్లర్ చేశారు. ఉపాసన కూడా రెండోసారి తల్లి కావడం వల్ల తనలో వచ్చిన ప్రశాంతత గురించి, చరణ్ పిల్లల పట్ల చూపిస్తున్న బాధ్యత గురించి ఇప్పటికే ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు పిల్లల రాకతో కొణిదెల ఇల్లు ఇప్పుడు ఒక నందనవనంలా మారిపోయింది. ఇక మెగాస్టార్ అనౌన్స్‌మెంట్‌తో శివరామ్, అన్వీరా దేవిల పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Tags:    

Similar News