టాక్సిక్ టీజర్..డోన్ట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్?
రెండే రెండు సినిమాలతో కన్నడ నాట టాప్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్. తన నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.;
రెండే రెండు సినిమాలతో కన్నడ నాట టాప్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్. తన నుంచి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. కారణం బ్యాక్ టు బ్యాక్ 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' సినిమాలలో తనదైన మార్కు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌ని అందించి తన స్టైల్ ఆఫ్ యాక్షన్‌ని చూపించి ఎంతో మంది అభిమానుల్ని యష్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి యష్ నుంచి సినిమా అంటే సహజంగానే సినీ లవర్స్ ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ల తరువాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకున్న యష్ ఇప్పుడు 'టాక్సిక్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్‌దాస్ ఈ మూవీకి డైరెక్టర్. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యుమ ఖురేషీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మలయాళ క్రేజీ హీరో టొవినోథామస్, బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ కజిన్, అక్షయ్ ఓబెరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళ. మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. 1940 టు 1970 మధ్య సాగే పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ టీజర్ అత్యంత వివాదాస్పదం కావడం తెలిసిందే. స్మశానంలో సాగే ఈ సీన్ ఎరోటిక్ సన్నివేశం, దానికి ఇంటర్ లింక్ చేస్తూ సాగే బ్లాస్టింగ్ సీన్ పై వివాదం చెలరేగింది. మహిళా దర్శకురాలై ఉండి ఇలాంటి ఎరోటిక్ సీన్‌ని ఎలా చేసిందని నెటిజన్‌లు, సినీ లవర్స్ `టాక్సిక్` టీమ్‌పై, డైరెక్టర్‌పై విమర్శల వర్షం కురిపించారు.
ఈ వివాదం కేంద్ర సెన్సార్ ఆఫీసర్ వరకు వెళ్లి నెట్టింట వైరల్‌గా మారింది. టీజలకు ఎలాంటి సెన్సార్ ఉండదని తను వెల్లడించినా సెన్సార్ ఉండాల్సిందని నెటిజన్‌లు వాదించారు. లేడీ డైరెక్టర్ మాత్రం ఈ వివాదాన్ని చాలా సింపుల్‌గా తీసుకుని కొట్టిపారేసింది. ఇంకా ఎక్కడ ఉన్నారని సెటైర్లు వేసింది. సినిమా బిజినెస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షురాలు డా.జయమాల చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యతన సంతరించుకున్నాయి. సినీ లవర్స్‌లో ఆసక్తికరంగా మారాయి.
బుక్‌ను దాని కవర్‌ను చూసి అంచనా వేయవద్దన్నట్టుగా టీజర్‌ని చూసి సినిమాపై ఓ నిర్ణయానికి రావద్దని డా.జయమాల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `టీజర్ అంటే ప్రేక్షకుల్ని థియేటర్లకు ఆకర్షించడానికి ఉద్దేశించిన చిన్న దృశ్యం. సెన్సార్ బోర్డ్ సమీక్షకు ముందే సినిమా గురించి ఒక నిర్ణయానికి రావడం అపరిపక్వ నిర్ణయమే అవుతుంది. మేకర్స్ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు నిర్మిస్తారు. అయితే దానిపై ప్రేక్షకుల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు పూర్తి సినిమా చేస్తే మంచిది. సినిమాలో ఆశ్లీల సన్నివేశాలేవీ లేవని నిర్మాతలు చెప్పారని, అలాంటివి ఏవైనా ఉంటే వాటిని సెన్సార్ కమిటీ చూసుకుంటుందని పేర్కొన్నారు.