సినిమా కలలతో కళ్యాణ్ పడాల.. అంత ఈజీ కాదు సుమా..?
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన కళ్యాణ్ పడాలకు సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన కళ్యాణ్ పడాలకు సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది. ఆర్మీ మ్యాన్ అయిన అతను బిగ్ బాస్ అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలవడం వెనక ఉన్న ఒకే ఒక్క ఆశయం అతను హీరో అవ్వాలనుకోవడమే. ఐతే బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ వస్తుంది. దాంతో అవకాశాలు కూడా వస్తాయి కానీ ఆ క్రేజ్ తో కెరీర్ లో సక్సెస్ అవ్వడమే, స్టార్ స్టేటస్ తెచ్చుకోవడమో అంటే కష్టం. బిగ్ బాస్ ప్రతి సీజన్ లో విన్నర్, రన్నర్ గా నిలిచిన కొందరు ఇప్పటికే సినిమాలు ట్రై చేశారు.. చేస్తూనే ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ నడిచేంతవరకే..
బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివ బాలాజితో పాటు నాలుగవ సీజన్ క్రేజ్ తెచ్చుకున్న సోహైల్, ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ, ఆరవ సీజన్ రన్నర్ అమర్ దీప్, ఏడవ సీజన్ రన్నర్ శ్రీహాన్ ఇలా అందరు సినిమాల్లో ప్రయత్నాలు చేశారు. బిగ్ బాస్ వల్ల ఆ సీజన్ నడిచేంతవరకే తప్ప ఆ తర్వాత వాళ్లను అసలు పట్టించుకోలేదు.
శివ బాలాజీ అంతకుముందు చేసిన సపోర్టింగ్ రోల్స్ కూడా ఇప్పుడు చేయట్లేదు. సోహైల్ రెండు మూడు సినిమాలు చేసి సైలెంట్ అయ్యాడు. ఒక మంచి బ్రేక్ కోసం అతను ఎదురుచూస్తున్నాడు. సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ కూడా అంతే 3 సినిమాలు ఒక వెబ్ సీరీస్ చేసినా లాభం లేకుండా పోయింది. సీజన్ 6 అమర్ దీప్ సీరియల్స్, షోస్, సినిమాలు చేస్తున్నాడు.
కళ్యాణ్ పడాల సిల్వర్ స్క్రీన్ ఆశలు..
సీజన్ 7 శ్రీహాన్ కూడా సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అంత గొప్ప అవకాశాలు అందుకోవట్లేదు. ఐతే వీరంతా ముందు ఉన్నా కూడా సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల సిల్వర్ స్క్రీన్ ఆశలు పెట్టుకున్నాడు. అఫ్కోర్స్ ఎవరి టాలెంట్ వారిది ఎవరి లక్ వారిది. అలాగని కళ్యాణ్ పూర్తిగా హీరోగానే తన కెరీర్ ఊహించేసుకుంటే మాత్రం కష్టమవుతుంది.
అతనికి ఆల్రెడీ ఆర్మీలో జాబ్ ఉంది. అటు జవాన్ గా తన డ్యూటీ చేస్తూనే వచ్చిన అవకాశాలు చేసుకుంటూ వెళ్తే బెటర్ అని టాక్. బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా గెలిచి కెరీర్ ని చక్కదిద్దుకున్న వాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. ఈ క్రేజ్ ఆ సీజన్ వరకే ఐతే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలంటే మాత్రం తమ టాలెంట్ ని చూపించాల్సిందే. మరి కళ్యాణ్ పడాల యాక్టింగ్ టాలెంట్ ఎలా ఉంటుంది. అతని తొలి సినిమా ఎలాంటి ప్రయత్నం చేస్తాడన్నది చూడాలి.